Site icon vidhaatha

ఏంటి ప్ర‌భాస్‌కి మ‌ళ్లీ స‌ర్జ‌రీనా.. ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు మంచి స్పీడ్ మీదున్నాడు. రీసెంట్‌గా ఆయ‌న న‌టించిన స‌లార్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది. ఇక త్వ‌ర‌లో క‌ల్కి, ది రాజా సాబ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. అయితే గ‌త కొద్ది రోజులుగా ప్ర‌భాస్ మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. నొప్పితోనే ప‌లు మూవీ షూటింగ్స్ కూడా చేశాడు.అయితే ఇటీవ‌ల నొప్పి తీవ్రత పెరగడంతో వైద్యులు సర్జరీ సూచించారు. గత ఏడాది ప్రభాస్ విదేశాల్లో సర్జరీ చేయించుకొని నెల రోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. సలార్ విడుదలకు ముందు ఇండియా వ‌చ్చి చిత్ర ప్రమోష‌న్స్‌లో పాల్గొన్నారు.

ఇప్పుడు ప్ర‌భాస్ కల్కి 2829 AD, రాజా సాబ్ చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉండ‌గా, ఇప్పుడు ఆయ‌న‌కి మోకాలి గాయం తిర‌గ‌బెట్టిన‌ట్టు ఓ వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. మ‌ళ్లీ నొప్పి తిర‌గ‌బెట్ట‌డంతో ప్ర‌భాస్ స‌ర్జ‌రీ కోసం విదేశాల‌కి వెళ్ల‌నున్నార‌నే వార్త ఒక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది.అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న లేదు కాని ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త మాత్రం నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఇది నిజ‌మైతే మ‌ళ్లీ క‌ల్కి మూవీ రిలీజ్ వాయిదా ప‌డే అవకాశం ఉంది. సమ్మర్ కానుకగా కల్కి మే 9న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ప్రభాస్ కి సర్జరీ జరిగి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే… విడుదల తేదీ వాయిదా పడటం ఖాయం. ఆల్రెడీ కల్కి 2024 సంక్రాంతి నుండి మే 9కి వాయిదా పడిన విషయం తెలిసిందే.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ‘సలార్’ సినిమా గత సంవత్సరం డిసెంబర్ 22న విడుదలై మంచి హిట్ అయిన విష‌యం విదిత‌మే. ఈ చిత్రంలో మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. విడుదలైన తరువాత ఈ సినిమా వసూళ్ళలో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించిన క‌లెక్ష‌న్స్ మాత్రం భారీగా వ‌చ్చాయి. ప్ర‌భాస్ కేవలం నాలుగు పోరాట సన్నివేశాల్లో ప్రధానంగా కనిపించినా, ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు.

Exit mobile version