టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాధితో కొన్నాళ్లుగా కుస్తీ పడుతున్న సమంత విదేశాలలో చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో సినిమాలకి ఏడాది పాటు బ్రేక్ కూడా ప్రకటించింది. అయితే సమంత మాదిరిగానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సినిమాలకి బ్రేక్ ప్రకటించబోతున్నట్టు ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఆరోగ్యం ఏమంత బాగోడం లేదు. అతని ఫేస్‌లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అలానే మోకాళ్ల సమస్యతో బాధపడుతున్నాడు. బాడీ కూడా ఫిట్ గా లేదని కామెంట్స్ వచ్చాయి. ఇటీవల ప్రభాస్ కి మోకాలి సర్జరీ కూడా చేయించుకున్నాడు.
సర్జరీ చేయించుకున్నా కూడా ప్రభాస్ మోకాళ్ల సమస్యతో బాధపడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కొన్ని రోజులు సినిమా షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకొని తన ఆరోగ్యంపై ఫోకస్ చేయాలని చూస్తున్నారు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా సమ్మర్ లో రాజా సాబ్ సినిమా షూట్ మొదలు పెట్టనున్నాడని తెలుస్తుంది. అయితే ఈ లోపు ప్రభాస్ ఓ మూడు నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ మోడ్ లో ఉంటాడని , రాజాసాబ్ తర్వాత సందీప్ వంగ స్పిరిట్, సలార్ 2 సినిమాలు చేయనున్నాడని తెలుస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన తన ఫిట్నెస్ కూడా పూర్తిగా కోల్పోయారు.అందుకే కొన్ని నెలలపాటు సినిమా ఇండస్ట్రీకి విరామం ఇచ్చేసి ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాలని భావించి తగినంత విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడట ప్రభాస్.
బాహుబ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు చేశాడు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక హిట్ కోసం ఆకలితో ఉన్న ప్రభాస్‌కి సలార్ రూపంలో ప్రశాంత్ నీల్ మంచి హిట్ ఇచ్చాడు. సలార్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఇక ప్రభాస్ నటించిన కల్కి చిత్రం త్వరలో విడుదల కానుండగా, ఈ మూవీ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.