రోజుకు ప్ర‌భాస్ భోజనం ఖ‌ర్చెంతో తెలిస్తే గుండె ప‌గిలిపోద్ది..!

  • Publish Date - December 29, 2023 / 02:48 AM IST

బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఇప్పుడు స‌లార్‌తో మ‌రో పెద్ద హిట్ కొట్టాడు. వరుస ఫ్లాపుల‌తో న‌లిగిపోతున్న ప్ర‌భాస్‌కి ఈ చిత్రం మంచి విజ‌యం అందించిందని చెప్పాలి. ప్ర‌స్తుతం స‌లార్ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు డార్లింగ్. ఈశ్వర్ సినిమాతో కెరీర్‌ని ప్రారంభించిన ప్రభాస్… చత్రపతి సినిమాతో తన కెరీర్ మార్చుకున్నాడు. అప్పటినుంచి ఇండస్ట్రీలో వెనక్కి చూసుకోకుండా దూసుకుపోతున్నాడు. అయితే ప్ర‌భాస్ పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంటుంది. నాలుగు ప‌దులు దాటిన కూడా ప్ర‌భాస్ పెళ్లి చేసుకోక‌పోవ‌డంతో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని తెగ విసిగిస్తున్నా కూడా మ‌నోడు మాత్రం దానిపై పెద్ద‌గా స్పందించ‌డం లేదు.

ప్ర‌భాస్ ప‌ర్స‌న‌ల్ విష‌యాలు చాలా అరుదుగా నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. తాజాగా ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రతిరోజు ప్రభాస్ ఎలాంటి ఫుడ్ తింటాడు ? అతను తినే ఫుడ్ కు ఎంత ఖర్చు అవుతుంది అనే దానిపై లెక్కలు వేస్తున్నారు. ప్రభాస్ భోజన ప్రియుడన్న విషయం మ‌న అందరికి తెలిసిందే. ఆయన నాన్ వెజ్ ఐటమ్స్ బాగా ఇష్టపడతారు. ప్రపంచంలోని అనేక అరుదైన వంటలు టేస్ట్ చేసిన ప్ర‌భాస్ త‌న‌కు నచ్చిన ఆహారాన్ని ఇంట్లో స్వయంగా వండించుకొని తింటాడు. అంతేకాదు ఆయ‌న‌తో ప‌ని చేసే నటులు, హీరోయిన్స్ కి కూడా మంచి ఆతిథ్యం అందిస్తూ వ‌స్తుంటారు ప్ర‌భాస్.

ప్ర‌భాస్ డౌన్ టు ఎర్త్ నేచర్ కి ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే. సలార్ మూవీలో ప్రభాస్ తో కలిసి పని చేసిన పృథ్విరాజ్ కూడా ప్రభాస్ ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పారు..ఇక ప్ర‌భాస్ ఎప్పుడు సింగిల్‌గా భోజనం చేయ‌ర‌ట‌.ఆయ‌న చుట్టూ ప‌ది మంది అయిన ఉండి తీరాల్సిందేన‌ట‌. ప్ర‌భాస్ మెనూలో చికెన్, మటన్, రొయ్యలు, చేపలు త‌ప్ప‌క ఉంటాయని తెలుస్తుంది. ప్రభాస్ ఇంట్లో వంట్లను చేయడానికి ఒక టీమ్ ఉండ‌గా, ఒక రోజు వాళ్ళు ప్రభాస్ కోసం ప్రిపేర్ చేసే భోజనం ఖర్చు రూ. 2 లక్షలు ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇది విన‌డానికి షాకింగ్‌గా అనిపించిన ఇది నిజం అంటున్నారు. అంటే ప్ర‌భాస్ తినే ఫుడ్ ఖ‌ర్చుతో వెయ్యి మందికి మంచి భోజనం అందించ‌వ‌చ్చు. ఏదేమైన రెబ‌ల్ స్టార్ రేంజ్ వేరు అని చెప్పాలి.

Latest News