Site icon vidhaatha

అయోధ్య‌లో అంద‌రికి ఉచిత భోజనం పెట్టేందుకు ప్ర‌భాస్ చేస్తున్న ఖర్చు ఇంతా?

డార్లింగ్ ప్రభాస్ చేసే ప‌నుల‌పై ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి క‌న్ను ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నిత్యం ఏదో ఒక విష‌యంతో ట్రెండ్ అవుతుంటారు. బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్‌కి వ‌చ్చిన క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇటీవ‌ల స‌లార్‌తో ఓ మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోవ‌డంతో ఇక ప్ర‌భాస్ క్రేజ్ మాములుగా లేదు. అయితే ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలే ఎక్కువ‌గా చేస్తుండ‌గా, ఆయ‌న రెమ్యున‌రేష‌న్ కోట్ల‌లో అందిపుచ్చుకుంటున్నాడు. మ‌రోవైపు ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌కి భారీ విరాళం కూడా అందిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ అయోధ్య రామ మందిరం ట్రస్ట్‌కు భారీ విరాళం ఇచ్చాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కొందరేమో రూ. 20 కోట్లు ఇచ్చారని చెబుతుండ‌గా, మ‌రి కొంద‌రు రూ. 50 కోట్లు ఇచ్చార‌ని చెబుతున్నారు. ప్రభాస్ భారీ విరాళం మీద మాత్రం చర్చలు జరుగుతూనే ఉండ‌గా, ఇందులో నిజం ఎంత ఉందనే దానిపై క్లారిటీ రావ‌డం లేదు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా బాలరాముడికి ప్రాణప్రతిష్ట జరగనుంది. దీనికోసం విదేశాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అతిథులంతా అయోధ్యకు భారీ ఎత్తున త‌ర‌లి రానున్నారు.ఈ క్ర‌మంలోనే రామమందిరం చుట్టుపక్కల కలిపి దాదాపు 300 ప్రాంతాల్లో అన్నదానం చేయనున్నారు. ఈ అన్న‌దానం కోసం ప్ర‌భాస్ త‌న వంతుగా రూ.50 కోట్లు విరాళం అందించాడ‌ని టాక్.

ఇక ఈ మ‌హోత్స‌వానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ని ఈ రామ‌మందిర ప్రారంభోత్స‌వానికి ఆహ్వానించ‌గా, ఆ రోజు అయోధ్య‌లో వారంతా సంద‌డి చేయ‌బోతున్నారు. ఇక ఇప్ప‌టికే దాదాపు అన్ని ఏర్పాట్లు చేయ‌గా, రామ మంద‌రి ప్రారంభోత్స‌వం రోజు టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తుంది.

Exit mobile version