Site icon vidhaatha

ప్ర‌భాస్ మోకాలి గాయం ఇంకా త‌గ్గ‌లేదా.. ఈ ఫోటో చూసి ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్

డార్లింగ్ ప్ర‌భాస్ వ‌య‌స్సు నాలుగు ప‌దులకి చేరుకున్న‌ప్ప‌టికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న ప్ర‌భాస్ అప్ప‌టి నుండి వ‌రుస పెట్టి భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు.బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చేసిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు పెద్ద దెబ్బ కొట్టిన ఇటీవ‌ల వచ్చిన స‌లార్ చిత్రం మాత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో మంచి జోష్ లో ఉన్న ప్ర‌భాస్ ఇప్పుడు క‌ల్కి, రాజా సాబ్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అయితే ప్ర‌భాస్ గ‌త కొద్ది రోజులుగా మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే.

స‌లార్ మూవీ రిలీజ్‌కి ముందు ఆయ‌న యూర‌ప్‌లో శ‌స్త్ర చికిత్స చేసుకున్నారు. అక్క‌డే కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకొని నెల రోజుల త‌ర్వాత ఇండియాకి వ‌చ్చారు. ఆప‌రేష‌న్ త‌ర్వాత ప్ర‌భాస్ కాస్త జోష్‌లో ఉన్న‌ట్టుగానే క‌నిపించాడు. అయితే తాజాగా ప్ర‌భాస్‌కి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ ఫొటో చూసిన వారు ప్రభాస్‌కి ఇంకా మోకాలి గాయం తగ్గలేదా అనే సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భాస్ ఇప్పుడు క‌ల్కి మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇట‌లీలో మూవీ షూటింగ్ జ‌రుగుతుండ‌గా, అక్క‌డ ప్రభాస్, దిశా పటాని పై ఓ రొమాంటిక్ పాటని చిత్రీకరిస్తున్నారు మేక‌ర్స్.

ప్ర‌భాస్ మోకాలి గాయం ఇంకా త‌గ్గ‌లేదా.. ఈ ఫోటో చూసి ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్షూటింగ్ సెట్స్ నుండి ప‌లు ఫొటోలు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ప్రైవేట్ జెట్ ఫ్లైట్ దిగుతున్న ప్ర‌భాస్ ఫోటో ఒక‌టి బయటకి వచ్చింది. ఆ ఫొటోలో ప్రభాస్.. చాలా ఇబ్బందిగా, జాగ్రత్తగా ఫ్లైట్ దిగుతున్న‌ట్టు మ‌న‌కు క‌నిపిస్తుంది. ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ .. ఏంటి ఇంకా ప్ర‌భాస్‌కి మోకాలి నొప్పి త‌గ్గ‌లేదా, ఇంకా ఆ నొప్పితో ఇబ్బంది ప‌డుతున్నాడా అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. మోకాలి నొప్పి చికిత్స తీసుకున్న త‌ర్వాత ప్ర‌భాస్ చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకోవ‌ల్సి ఉన్నా అత‌ను కమిటైన ప్రాజెక్ట్‌లు లేట్ అవుతున్న క్ర‌మంలో ప్ర‌భాస్ అలానే షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ఇక కల్కి మూవీ షూటింగ్ చివరి దశలో ఉండ‌గా, చిత్రం మే 9న రిలీజ్ కాబోతుంది.

Exit mobile version