తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఉన్నప్పటికీ వారిలో కొందరు మాత్రమే తమ అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారిలో ప్రగతి కూడా ఒకరు. ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించిన ప్రగతి ఈ మధ్య జిమ్‌వేర్ డ్రెస్సులలో ఎక్కువగా కనిపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోవడం వల్ల చాలా కష్టాలను ఆర్థిక ఇబ్బందులను ప్రగతి ఎదుర్కొంది. తొలుత హీరోయిన్ అవుదమని ఇండస్ట్రీలో అడుగపెట్టిన ప్రగతి దాదాపు ఐదారు సినిమాలలో కథానాయికగా నటించింది. అయితే హీరోయిన్‌గా చేసిన ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారడం వెనక ఒక స్టోరీ ఉంది.
క్యారెక్టర్ ఆర్టిస్టు అయితే జీవితం చివరి వరకు నటిగా మిగిలిపోవచ్చు. కాబట్టి నీవు క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపో అని ప్రగతి ఫ్రెండ్ ఒకరు ఆమెకి సలహా ఇచ్చారు. అలా చిన్న వయసులోనే తల్లి పాత్రలు పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి వరకు ప్రగతి తల్లి, వదిన, అక్క లాంటి పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రగతి తన తల్లిని పోషించడం కోసం కెరియర్ మొదట్లోనే కార్టూన్ పాత్రలలో కూడా డబ్బింగ్ చెప్పేదట. అంతేకాకుండా మైసూర్ సిల్క్ ప్యాలెస్ లో మోడల్ గా కూడా పనిచేసినట్టు ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.
ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 7 వేదికపై ప్రగతి గురించి నాగార్జున మాట్లాడుతూ.. వెయిట్ లిప్టింగ్‌లో స్టేట్ ఛాంపియన్ షిప్ సాధించిన ప్రగతి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఛాంపియన్‌షిప్ సాధించేందుకు రెడీ అవుతున్నది. ఆమె సాధారణమైన ఉమెన్ కాదు అని ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ప్రగతి చేతిపై ఉండే ఓ టాటూ ఎప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ టాటూ సీక్రెట్‌ని రీసెంట్‌గా రివీల్ చేసింది ప్రగతి. చిన్నతనంలో ఒక వ్యాక్సిన్ సెప్టిక్ అయ్యి అది మచ్చగా మారడంతో ఆ మచ్చ కనిపించకుండా ఉండేందుకే ఇలా టాటూ వేయించుకున్నాను అంటూ ప్రగతి తెలియజేసింది. ప్రగతి ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తుంది.