Site icon vidhaatha

ప్ర‌గ్యా జైస్వాల్ విర‌హ జ్వాల‌.. బ్లాక్ డ్రెస్‌లో అందాల ర‌చ్చ‌

అందం, అభిన‌యం, టాలెంట్ అన్ని ఉన్నా కూడా అదృష్టం లేక అవ‌కాశాలు అందుకోలేక‌పోతున్న అందాల ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న ఈ భామ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసింది. కాని ఈ అమ్మ‌డి కెరియ‌ర్‌కి ఉప‌యోగ‌ప‌డేది అందులో ఏది లేదు. అందాలు ఓ రేంజ్‌లో ఆర‌బోసిన కూడా ఎందుకు ప్ర‌గ్యాకి అనుకున్నంత‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. బాలయ్యతో చేసిన అఖండ బంపర్ హిట్ అయిన కూడా ఆ స‌క్సెస్ బాల‌య్య ఖాతాలోకి చేర‌డంతో ఈ అమ్మ‌డికి నిరాశే అయింది. ఇటీవ‌లి కాలంలో అవ‌కాశాలు లేక వీలునపుడల్లా స్కిన్ షోతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ న‌టించ‌గా, ఈ మూవీ త‌ర్వాత మ‌ళ్లీ చిత్రం చేయ‌లేదు ప్ర‌గ్యా జైస్వాల్ . 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ‌. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. కాని ప్ర‌గ్యా ఫేట్ మాత్రం మార్చ‌లేక‌పోయింది. మంచి అవ‌కాశం వ‌స్తే త‌న టాలెంట్ ఏంటో చూపిస్తానంటుంది ప్ర‌గ్యా. గ్లామ‌ర్ షోకి కూడా తాను సిద్ధ‌మే అని హింట్ కూడా ఇస్తుంది. కాని ఆమెని ప‌ట్టించుకునే నాథుడే లేడు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త లుక్‌లో కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల గుండెల‌లో గుబులు రేపుతూ ఉంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌.

ప్ర‌గ్యా జైస్వాల్ ఒక్కోసారి బికినీలో కూడా గుబులు పుట్టిస్తుంటుంది. తాజాగా కంచె బ్యూటీ మరోసారి తన అందాల వేడి చూపించింది. కనీవినీ ఎరుగని విధంగా అట్రాక్ట్ చేస్తున్న బ్రా లాంటి బ్లాక్ టాప్ లో నిలువెల్లా సొగసు చూపిస్తూ కురాళ్లకి కంటిపై నిద్ర లేకుండా చేసింది. ప్రగ్యా జైస్వాల్ అందాలు , ఆమె పరువాలకి నెటిజ‌న్స్ చిలిపి కామెంట్స్ చేస్తున్నారు. కొంద‌రు అయితే ప్ర‌గ్యా నిన్ను ఇలా చూస్తుంటే మా నరాలు తెగిపోతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. నాభి సొగసుపై నెటిజన్లు రెచ్చిపోతూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ రేంజ్‌లో ప్ర‌గ్యా గ్లామ‌ర్ షో చేస్తున్నా కూడా 2023లో ఈ అమ్మ‌డికి ఒక్క సినిమా అవకాశం లేకుండా పోయింది. అయితే అంద‌రి అటెన్ష‌న్ పొందేందుకు ఇలా గ్లామ‌ర్ షో చేస్తూ అప్పుడ‌ప్పుడు వార్త‌ల‌లో ఉంటుంది ప్ర‌గ్యా.

Exit mobile version