Site icon vidhaatha

బిగ్ బాస్ హౌజ్‌లో గ్రూప్ రాజ‌కీయాలు.. త‌న టీమ్‌కి హిత‌బోధ చేసిన శివాజి

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 కార్య‌క్ర‌మం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. కొన్ని వారాలు ముగిసిన త‌ర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ప‌లువురిని హౌజ్‌లోకి ప్ర‌వేశ‌పెట్ట‌డం, ఎలిమినేట్ అయిన ఒక‌రిని తిరిగి హౌజ్‌లోకి తీసుకు రావ‌డం అంతా ఉల్టాపుల్టాగా సాగుతుంది. మ‌రోవైపు హౌజ్‌మేట్స్ కూడా వెరైటీగా గేమ్ ఆడుతూ నానా ర‌చ్చ చేస్తున్నారు. బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌లో ఎప్ప‌టిలానే తేజ నిద్ర‌పోయాడు. దీంతో కుక్క‌లు మొర‌గ‌డంతో గౌత‌మ్‌… అత‌నికి పనిష్‌మెంట్ ఇచ్చాడు. అమ్మాయిలా చీర‌క‌ట్టుకొని ఉండాలి అని చెప్ప‌డంతో, శోభ అత‌నికి చీర క‌ట్టింది.

చీర‌క‌ట్టులో అమ్మాయిలా మారిన తేజ కొద్ది సేపు ఎంట‌ర్‌టైన్ చేశాడు. అమ్మాయిలు అమ్మాయిలు క‌లుసుకున్న‌ప్పుడు హ‌గ్ చేసుకుంటారు క‌దా అని ర‌తిక‌, శోభాశెట్టిల‌ని హ‌గ్ చేసుకొని ఆనందాన్ని పొందాడు. ఇక శివాజీతో అన్నా, చెల్లెల‌మంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్ర‌తి సీజ‌న్ మాదిరిగానే ఈ సీజ‌న్‌లో కూడా గ్రూపులుగా విడిపోయారు. గ్రూపు రాజ‌కీయాలు చేస్తూ ఒకరినొక‌రు టార్గెట్ చేసుకుంటున్నారు. ఒక గ్రూపులో శివాజీ, యావర్‌, ప్రశాంత్‌, రతిక, ఉండ‌గా మ‌రో గ్రూపులో అమర్‌ దీప్‌, శోభా శెట్టి, అశ్విని, గౌతమ్ ఉన్నారు.శివాజీ టార్గెట్‌గా వారు ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ప‌ల్ల‌వి ప్ర‌శాంత్, యావ‌ర్‌ల‌కి శివాజీ కొన్ని సూచ‌న‌లుచేశాడు.

మిమ్మ‌ల్ని ఎవ‌రు ఎలా ప్రొవోక్ చేసిన కూడా ఆవేశ‌ప‌డొద్దు, న‌వ్వుతూ ఉండాలి, కూల్‌గా కామ్‌గా ఉండాల‌ని చెప్పాడు. అనంత‌రం బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. హౌజ్‌మేట్స్‌ని వీరసింహాలు, గర్జించే పులులు అనే రెండు గ్రూపులుగా విడగొట్టి గేమ్ ఆడించాడు. యావర్‌, గౌతమ్‌, భోలే, తేజ, శోభా శెట్టి, రతిక వీర సింహాలు గ్రూపులో ఉండ‌గా, అమర్‌ దీప్‌, ప్రశాంత్‌, శివాజీ, అర్జున్‌, ప్రియాంక, అశ్విని గర్జించే పులులు టీమ్‌లో ఉంటారు. మొద‌ట టాస్క్‌లో భాగంగా బాల్స్ ప‌ట్టుకొని వారికిచ్చిన ప్యాకెట్‌లో జాగ్ర‌త్త‌గా పెట్టుకోవాల‌ని అన్నారు. ఈ టాస్క్‌లో చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అయితే ఈ టాస్క్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే బిగ బాస్ బెలూన్స్ ని టైర్లలో ఫిల్‌ చేయడం టాస్క్ ఇచ్చాడు. ఇందులో వీర‌సింహాలు టీమ్ గెలుపొందింది. ఈ క్ర‌మంలో వారిని ప్రత్యర్థి టీమ్ నుండి ఒకరిని ఆట నుంచి తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. ప్ర‌శాంత్‌ని గేమ్ నుండి తొల‌గిస్తున్నామ‌ని చెప్ప‌డంతో ఆయ‌న క‌న్నీరు పెట్టుకున్నారు.  

Exit mobile version