Site icon vidhaatha

అమ‌ర్‌దీప్‌పై రివెంజ్ తీర్చుకున్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ఫ్యాన్స్..స్టూడియా ఎదుట ఆయ‌న కారుపై దాడి

బిగ్ బాస్ సీజ‌న్ 7 అంతా ఉల్టా పుల్టా అని తెగ ప్ర‌చారం చేయగా, ఈ సీజ‌న్‌పై చాలా మంంది ఆస‌క్తి చూపించారు. ఇక 19 మంది కంటెస్టెంట్స్‌తో ఈ షో మొద‌లు కాగా, చివ‌రికి ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ క‌ప్ ఎగ‌రేసుకుపోయాడు. అయితే ఇందులో SPY – SPA బ్యాచ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ (SPY), శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్‌లు (SPA) గ్రూపులుగా విడిపోయి ఆటను రక్తికట్టించారు. అయితే హౌజ్‌లో అమ‌ర్ దీప్, ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ మ‌ధ్య ఎంత ర‌చ్చ జ‌రిగిందో మ‌నం చూశాం. 14వ వారంలో అమ‌ర్ దీప్.. ప్ర‌శాంత్‌ని చాలా దారుణంగా చూశాడు. తిట్టడం… కొట్టడం.. ఒరేయ్.. తురేయ్ అని పిలవడం… ఇవన్నీ దాటేసి.. ప్రశాంత్‌కి పంటితో కొరికడం వంటివి చేశాను.

తన బాధను ప్రశాంత్.. బిగ్ బాస్‌కి చెప్పుకుంటుంటే.. మెడికల్‌ రూంకి తోసుకుంటూ పోయాడు. తనని తాను తగ్గించుకుని ప్రశాంత్ ఎంత చెప్పినా వినకుండా.. ప్రశాంత్‌‌పై చేయి చేసుకుని తోసుకుంటూ వెళ్లిపోయాడు. ఇదంతా మ‌న‌సులో పెట్టుకున్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ఫ్యాన్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాక అమ‌ర్‌దీప్ తో పాటు వారి ఫ్యామిలీపై దాడి చేసే ప్ర‌య‌త్నం చేశారు. స్టూడియో బ‌య‌ట అమ‌ర్ దీప్ త‌న ఫ్యామిలీతో కారులో వెళుతుండ‌గా, వందలాది మంది అల్లరి మూకల గుంపు ఒక్కసారిగా ఆయ‌న కారుపై దాడి చేసింది. దాదాపు అరగంట పాటు.. కారులోనే ఉండిపోయిన అమర్ దీప్ భ‌య‌బ్రాంతుల‌కి గురైపోయాడు. కారులో అమర్ దీప్ తల్లి.. అతని భార్య.. స్నేహితుడు నరేష్ లొల్ల.. డ్రైవర్ ఉన్నారు.

అమ‌ర్‌దీప్‌ని నానా బూతులు తిడుతూ కారు అద్దాల‌ని సైతం ధ్వ‌సం చేసి బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేశారు. అరగంట పాటు ప్రాణాలను వారు అరచేతుల్లో పెట్టుకున్నారు. ముందు నుంచి వెనుక నుంచి కారును ద్వంసం చేస్తూ సైకోలుగా ప్ర‌వ‌ర్తించారు. అమ‌ర్ దీప్ భార్య‌ని సైతం తిట్టిపోసారు. ఆ త‌ర్వాత పోలీసులు స‌మాచారం అందుకోవ‌డంతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు వారిని పంపించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఫ్యాన్స్‌గా చెప్పుకునే సైకోలు కొంద‌రు అమర్ దీప్ కారుపైనే కాకుండా.. మిగిలిన కంటెస్టెంట్స్ కార్ల‌తో పాటు.. యాంకర్ గీతు రాయల్ కారుపై దాడి చేశారు. ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వసం చేశారు. రోడ్డుపై వెళ్తున్న బస్సు అద్దాలను బద్దలకు కొట్టి.. విధ్వంసం సృష్టించారు.  

Exit mobile version