బిగ్ బాస్ సీజన్ 7 మరో మూడు వారాలలో ముగియనుంది. ప్రస్తుతం హౌజ్‌లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుందని నాగార్జున ముందుగానే హింట్ ఇచ్చేయడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని కంటెస్టెంట్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అదే క్రమంలో కసిగా కూడా గేమ్ ఆడుతున్నారు. ఇక సోమ, మంగళవారాలలో నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఇంట్లో వాళ్లలో ఒకరు తన వైఫ్‌ని చంపేసారని వారెవరో కనుక్కోవాలని అర్జున్, అమర్‌కి చెప్పారు. ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యతని వారిద్దరు తీసుకోగా , బిగ్ బాస్ వైఫ్ కు చెఫ్ గా ప్రశాంత్, మేనేజర్ గా శివాజీ, బట్లర్స్ గా ప్రియాంక, యావర్. దోబీగా గౌతమ్, సెక్యూరిటీగా రతిక ఉన్నారు.
మర్ధర్ ఇన్వెస్టిగేషన్ ను ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడానికి టీవీ జర్నలిస్ట్ లుగా శోభా, అశ్వినీని నియమించారు బిగ్ బాస్. ఇక ఇన్వెస్టిగేషన్ గేమ్ స్టార్ట్ కాగా, మిసెస్ బిగ్ బాస్ ని ఎవరు చంపారో కనుక్కొనే పనిలో పడ్డారు. అయితే అందరు ఎవరి పనిలో వారు ఉండగా గౌతమ్, రతికలు ఒకవైపు ప్రేమించుకుంటూనే మరోవైపు అందరి బ్యాగ్‌లు చెక్ చేసే పనిలో ఉంటారు. మరోవైపు అమర్,శోభకి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. చిన్నది కాస్త పెద్దదిగా మారడంతో అమర్ తన చేతిలో ఉన్న లాఠీని కూడా విసిరేస్తాడు. అయితే గొడవ రచ్చగా మారుతున్న సమయంలో శివాజీని మర్డర్ చేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశిస్తాడు.
మొక్కను పోస్ట్ బాక్స్ లో పెట్టి ప్రశాంత్ మర్డర్ ను సక్సెస్ చేయాలని శివాజికి బిగ్ బాస్ చెబుతాడు.. ఈక్రమంలో ప్రశాంత్ ను స్టోర్ రూమ్ లో లాక్ చేసి ఆయన మొక్కను పోస్ట్ బాక్స్ లో పెట్టి.. మర్డర్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేస్తాడు. అందరితో పాటు ప్రశాంత్ ను వెతికినట్టు నటిస్తుంటాడు. ఒకవైపు ఇన్వెస్టిగేన్ కొనసాగుతుండగానే.. ప్రశాంత్ లోపల ఉండలేక లాజిక్ లు ఆలోచిస్తుంటాడు. అయితే మర్డర్ చేయడంలో శివాజి సక్సెస్ కాగా, చనిపోయిన ప్రశాంత్ ఘోస్ట్‌గా మారతాడు. ఆయన దెయ్యంగా మారి బిగ్ బాస్ హౌజ్‌లో తిరగాలని ఆదేశించడంతో ఆయన ఆ పనిలో ఉంటాడు. ఇక తన మొక్క కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికే పనిలో ఉంటాడు. దీంతో తాజా ఎపిసోడ్‌కి పులిస్టాప్ పడింది.