Site icon vidhaatha

3 కోట్ల‌తో తెర‌కెక్కి 70 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రం..తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే..!

ఇటీవ‌ల కొన్ని చిత్రాలు సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాయి. చాలా త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి పెద్ద విజ‌యం అందుకుంటున్నాయి. ముఖ్యంగా మ‌ల‌యాళ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాయి. కంటెంట్ బేస్డ్ చిత్రాల‌కు ప్రేక్ష‌కుల బ్ర‌హ్మ‌రధం ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ చిత్రాలు స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తున్నాయి.స్టార్ ఇమేజ్ ముద్ర లేకుండానే మంచి విజ‌యం సాధిస్తున్న చిత్రాలు ఇటీవ‌లి కాలంలో చాలానే వ‌చ్చాయి. త‌క్కువ బ‌డ్జెట్ లో సినిమా చేసి వంద‌ల కోట్లు కొల్ల‌గొట్టాయి.’ది కేర‌ళ స్టోరీ’ లాంటి చిన్న సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో పెద్ద విజ‌యం సాధించి అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది. ఇప్పుడు ఓ మ‌ల‌యాళ చిత్రం కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

‘ప్రేమలు’ అనే చిత్రం ఈ నెల 9వ తేదీన మలయాళంలో విడుద‌లై పెద్ద విజ‌యం సాధించింది. మొద‌టి షో నుండే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావ‌డంతో జ‌నాలు థియేట‌ర్స్‌కి క్యూ క‌ట్టారు. మేక‌ర్స్ పెద్ద‌గా ప్ర‌మోష‌న్ చేయ‌క‌పోయిన కూడా సినిమాని చూసిన ప్రేక్ష‌కులు ఇది పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమా అని స్వ‌చ్ఛందంగా ప్ర‌మోట్ చేయ‌డంతో మూవీకి మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. ఈ సినిమా కేవ‌లం మూడు కోట్ల‌తో తెర‌కెక్కి 70 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు రాబ‌ట్టింది. అతి త‌క్కువ బ‌డ్జెట్ లో తెర‌కెక్కించి ఈ రేంజ్ వ‌సూళ్లు సాధించిన తొలి మ‌ల‌యాళ సినిమాగా ప్రేమలు చిత్రం స‌రికొత్త రికార్డ్ నెల‌కొల్ప‌డం విశేషం.

రానున్న రోజుల‌లో ఈ మూవీ మ‌రిన్ని వ‌సూళ్లు రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్టుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ మ‌న హైద‌రాబాద్‌లోనే జ‌రిగింది. చిత్రంలో నస్లేన్ .. మమిత .. అల్తాఫ్ సలీమ్ .. మీనాక్షి రవీంద్రన్ .. అఖిల భార్గవ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. చిత్రం మంచి హిట్ కావ‌డంతో తెలుగు హక్కులను రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్.ఎస్. కార్తికేయ సొంతం చేసుకున్నారు. మార్చి 8న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని స‌న్నాహా లు చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. ఇక మూవీ ఓటీటీ హ‌క్కుల విష‌యానికి వ‌స్తే హాట్ స్టార్ ద‌క్కించుకుంద‌ని టాక్. ద‌ర్శ‌కుడు గిరీశ్ తెర‌కెక్కించిన విధానానికి ప్ర‌తి ఒక్క‌రు ఇంప్రెస్ కావ‌డంతో అన్ని వ‌ర్గాల నుండి మూవీకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

Exit mobile version