బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమం మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ షోలో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా, రన్నరప్‌గా అమర్ నిలిచారు. ఇక టాప్ 5లో నిలిచిన ఒకే ఒక్క మహిళగా ప్రియాంక గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం శివ కుమార్ తో కలిసి పీకల్లోతు ప్రేమలో పాల్గొంది. బిగ్ బాస్ హౌజ్‌లో ప్రియాంక ఉన్నప్పుడు ఆయన ప్రియుడు శివ కుమార్ అక్కడికి వెళ్లి నానా రచ్చ చేశాడు.ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. ఆడియన్స్ కూడా అవాక్కు అయ్యారు. ఇక ప్రియాంక.. శివ కుమార్ ని పెళ్లి చేసుకుందామని అడగగా, నువ్వు బయటకు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుందామని శివ కుమార్ అన్నాడు.
అయితే ఇప్పటికీ వారిద్దరు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయడంపై తెగ ట్రోల్స్ వస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మౌనరాగం సీరియల్ లో కలిసి నటించిన శివ కుమార్ – ప్రియాంకలు ప్రేమలో పడగా,అప్పటి నుండి వారిద్దరు కలిసే ఉంటున్నారు. పెద్దల అనుమతితోనే వారిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే పెళ్లి గురించి స్పందిస్తూ.. పెళ్లి కాకపోయిన ప్రియాంక నా భార్య. దేవుడి దయతో 2024 లోనే పప్పన్నం పెట్టాలని అనుకుంటున్నాం అని అన్నాడు. ఈ ఏడాది లోపే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు శివ కుమార్ అన్నాడు. ఒకవేళ ఈ ఇయర్ లో కాకపోతే 2025 లో కచ్చితంగా మా పెళ్లి ఉంటుందని అన్నాడు.
ప్రియాంక కి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అని ఆశలు ఉన్నాయట. గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని ఉందట. అందుకు కావల్సినంత డబ్బులు లేవు. అవి సంపాదించుకున్న తర్వాత మేము పెళ్లి చేసుకుంటామని అంటున్నాడు శివ కుమార్. పెళ్లి తర్వాత ప్రియాంకను తీసుకుని వరల్డ్ టూర్ వెళ్తాను అంటూ శివ అన్నాడు. పెళ్లి కాకుండా కలిసి ఉండటం పై చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. మాకు మా బంధం గురించి క్లారిటీ ఉంది. మాపై వచ్చే బ్యాడ్ కామెంట్లను పట్టించుకోము. పట్టించుకుంటే హ్యాపీ గా ఉండలేము అంటూ ప్రియాంక – శివ కుమార్ చెప్పుకొచ్చారు.