Site icon vidhaatha

ఘోర‌మైన త‌ప్పిదం చేసిన ప్రియాంక సింగ్.. ఆసుప‌త్రి పాలైన ట్రాన్స్‌జెండర్

ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ గురించి తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టెంట్ గా, జ‌బ‌ర్ధ‌స్త్ ఫేమ్‌గా చాలా మందికి సుప‌రిచితం అయింది. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ఈమె ట్రాన్స్ జెండర్ అయిన కూడా త‌న అందంతో ప్ర‌తి ఒక్క‌రిని క‌ట్టిప‌డేస్తుంటుంది. ఈమె స‌ర్జ‌రీ స‌మ‌యంలో న‌రకం చూసిన‌ట్టు ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పుకొచ్చింది. ఆపరేషన్ తర్వాత ఆమె హెల్త్ సెట్ అవ్వడానికే రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టింద‌ని కూడా పేర్కొంది. ఆరోగ్యం పూర్తైన త‌ర్వాత మెల్లిమెల్లిగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈమె షోలతో తెగ సంద‌డి చేస్తుంది. తాజాగా ఈమె చేసిన ఘోర త‌ప్పిదానికి ఆసుప‌త్రి పాలు కావ‌ల‌సి వ‌చ్చింది

ప్రస్తుతం ‘హనుమాన్‌’ ఫేం ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో ప్రియాంక న‌టిస్తుండ‌గా, దీనితో పాటు ప‌లు ఆఫ‌ర్స్ ఆమె చేతిలో ఉన్నాయి. అయితే ఢీ జోడీ.. డ్యాన్స్ షో కోసం యాంకర్ శివతో కలిసి ఈమె విప‌రీతంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింద‌ట‌. దాంతో విప‌రీతంగా బాడీ పెయిన్స్ రాగా, సొంత వైద్యం వాడింది. ఎక్కువ‌గా పెయిన్ కిల్ల‌ర్ ట్యాబ్లెట్స్ వాడ‌డంతో ఆరోగ్యం మాత్రం పాడైంద‌ట‌. ముఖ్యంగా కిడ్నీలు కూడా పాడయ్యే స్థితికి చేరుకుంది. తన ఆరోగ్యం బాగా క్షీణించిందని, దాంతో ఏఐజీ హాస్పిటల్లో చేరానంటూ ఓ వీడియో ద్వారా తెలియ‌జేసింది ప్రియాంక సింగ్.

మెడికల్‌ షాప్స్‌ తిరుగుతూ.. ఓవర్ డోస్‌ మెడిసన్స్‌, యాంటిబయాటిక్‌ వంటి మందులు వాడటం వల్ల నా ఆరోగ్యం చాలా పాడైంది. డాక్ట‌ర్ స‌ల‌హ లేకుండా మీరు ఎలాంటి మందులు వాడి ఆరోగ్యం పాడు చేసుకోవ‌ద్దు. ఎలాంటి హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్న డాక్టర్‌ను సంప్రదించండి. వారు ఇచ్చిన సలహా, సూచనలే పాటించండి కాని సొంతంగా మందులు వాడి ప్రాణాలు మీదకి తెచ్చుకోవ‌ద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది. ఇక తాను ఆస్పత్రి పాలవ్వడంతో ఆ డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ కూడా చేయలేకపోయా. నా స్థానంలో ఆక్సా ఖాన్‌ చేశారు అంటూ ప్రియాంక సింగ్ స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం తాను వైద్యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.

Exit mobile version