టాలీవుడ్ క్రేజీ కమెడీయన్స్‌లో పృథ్వీ ఒకరు. తనదైన కామెడీతో ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ పృథ్వీకి కేరాఫ్‌గా మారింది. ఇటు చిన్న చిత్రాల్లో , అటు పెద్ద చిత్రాలలో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి. 2019 ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి తెగ హంగామా చేశారు. రాష్ట్రం మొత్తం తిరిగి తెగ ప్రచారం చేయగా, ఆయనకి జగన్ ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత పృథ్వీ ఓ మహిళతో తప్పుగా ప్రవర్తించాడంటూ ఆరోపణలు రావడం, ఆయన పదవ ఊడిపోవడం జరిగింది. ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు పృథ్వీ.
మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు పృథ్వీ. అయితే పృథ్వీ దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం తన కూతురు శ్రీలు హీరోయిన్ గా, క్రాంతి ప్రధాన పాత్రలో కొత్త రంగుల ప్రపంచం అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కూతురితో కలిసి తెగ సందడి చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీ.. కూతురి ప్రేమాయణం, ఆస్తులు వంటి వాటికి సంబంధించి ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. యాంకర్.. మీ కుమార్తె ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లబోతోంది అని అడగడంతో శ్రీలు సిగ్గు పడుతున్నట్టుగా ప్రోమోలో కనిపించింది. ఇక పృథ్వీ ఏదో వివరణ ఇస్తున్నట్టుగా అర్ధమైంది.
మరోవైపు పృథ్వీ రాజ్ ఆస్తి గురించి చర్చకు వచ్చింది. మీ నాన్న ఆస్తి ఎంత ? 500 కోట్లా, 100 కోట్లా, 2 వేల కోట్లా అని యాంకర్ శ్రీలుని ప్రశ్నించగా.. నాకు తెలియదు అంటూ ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఇక తండ్రి పొలిటికల్ కెరీర్ గురించి శ్రీలు మాట్లాడుతూ ..పరోక్షంగా ఆడియో లీక్ వ్యవహారం గురించి తెలిపింది. పొలిటికల్ గా ఒక విషయం జరిగినప్పుడు నాన్న డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అది చూసి నేను తట్టుకోలేకపోయాను అని శ్రీలు చెప్పుకొచ్చింది. ఇక అభిమానులు మిమ్మల్ఇ 30 ఇయర్స్ పృథ్వీ అని పిలిస్తే సంతోషమా లేక పృథ్వీ రాజ్ అని పిలిస్తేనా అని ప్రశ్నించగా.. 30 ఇయర్స్ పృథ్వీ అనే సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే అది నాకు ఇండస్ట్రీలో గుర్తింపు నిచ్చిన మ్యాజరిజం అని పృథ్వీ తెలిపారు.. అలాగే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గురించి కూడా పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ తన బాస్ మాదిరిగా ఇండస్ట్రీని, పాలిటిక్స్ ని బ్యాలెన్స్ చేస్తా అని చెప్పారు. ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయితే అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి.