Site icon vidhaatha

రూ.80 కోట్లు కొట్టేశారు.. వాడి వ‌ల్లే మేము రోడ్డున ప‌డ్డాం అంటూ పూరీ జ‌గ‌న్నాథ్ త‌ల్లి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసిన పూరీ ఇప్పుడు మాత్రం అంత‌గా స‌క్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత పూరీ మ‌రో హిట్ కొట్ట‌లేదు. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ సీక్వెల్‌తో హిట్ కొట్టాల‌ని ఎంత‌గానో భావిస్తున్నాడు. అయితే పూరీ జ‌గ‌న్నాథ్ త‌ల్లి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో కొన్ని షాకింగ్ విష‌యాలు వెల్ల‌డిస్తూ హాట్ టాపిక్ అయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బద్రి చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాలను వేగంగా తెరకెక్కించి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయ‌న ఎలాంటి క‌ష్టాలు ఎదుర్కొన్నాడు అనేది ఆయ‌న త‌ల్లి తెలియ‌జేసింది.

పూరీకి ఏడో తరగతి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం అని చెప్పిన ఆయ‌న త‌ల్లి తాను సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ప్రయత్నించిన రోజుల్లో ఇంటి నుంచి డబ్బులు పంపించేవాళ్లం. అవి సరిపోక తాను కూడా ఎంతో క‌ష్ట‌ప‌డేవాడు. ఓ సారి నేను పూరీ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు అత‌డి పాదాలు వాచిపోయి, సాక్సులు వేసుకోవ‌డానికి కూడా ఇబ్బంది ప‌డ్డాడు. ఇంత క‌ష్టం ఎందుకు , ఊరికి వచ్చి పొలం పని చేసుకొమని అడిగాను. కానీ పూరీ అందుకు దేవుడు నా కష్టం చూడకపోతాడా అని ప్రయత్నిస్తూనే వ‌చ్చాడు.. అలా పన్నేండు సంవత్సరాలు కష్టపడ్డాడు. అన్నం తినకుండా మంచినీళ్లు మాత్రమే తాగని రోజులు కూడా ఉన్నాయి అని పూరీ త‌ల్లి స్ప‌ష్టం చేసింది.

పూరీ ద‌ర్శకుడిగా మారాక అత‌ని దగ్గర పనిచేసే కుర్రాడు ఒకడు రూ. 80 కోట్లు కొట్టేసి మోసం చేశాడు. ఒక సినిమా వల్ల కూడా నష్టం వచ్చింది. దీనితో ఒక్కసారిగా కుటుంబంపై పిడిగు పడ్డట్లు కావ‌డం, దాదాపు 5 ఇళ్లు అమ్మేయ‌డం జ‌రిగింది. విధిన‌ పడే పరిస్థితి వ‌చ్చింది. మోసం చేసిన వాడి కాళ్ళు చేతులు విరిచేద్దామా అని పూరి స్నేహితుడు ఒకరు సలహా ఇవ్వగా.. వద్దని చెప్పాడు. తనకి ఇంకా సంపాదించే శక్తి ఉందని మమ్మల్ని ఓదార్చాడు. డ‌బ్బులు కొట్టేసిన వాడు బాగుప‌డ్డాడా అంటే అది లేదు. సినిమాల‌లో అన్నీ పొగొట్టుకున్నాడు. చిన్న‌ప్ప‌టి నుండి పూరీకి జాలి, ద‌యాగుణం ఎక్కువ‌. ఒక కుర్రాడు బావిలో పడిపోతే, అతణ్ణి కాపాడటం కోసం చిన్నప్పుడే బావిలోకి దూకేశాడు. అంతటి గొప్ప మనసున్నోడు నా కొడుకు. వాడిపడిన పడ్డ కష్టలు ఎవరికి రాకుడాదంటూ పూరీ జ‌గ‌న్నాథ్ త‌ల్లి చాలా ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేసింది.

Exit mobile version