ఇటీవలి కాలంలో నిర్మాతలకి లీకుల బెడద చాలా పెద్ద సమస్యగా మారింది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని కాదు.. ఏ సినిమాలు అయిన సరే లీకులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. షూటింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక విధంగా లీకులు జరుగుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప2 చిత్రానికి కూడా లీకుల బెడద తప్పడం లేదు. గతంలో పుష్ప చిత్రం కూడా లీకుల బారిన పడింది. పుష్ప చిత్రం మంచి విజయం సాధించడంతో పుష్ప 2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
పుష్ప 2 సినిమా నుండి విడుదలైన అప్‌డేట్స్ ఫ్యాన్స్‌కి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ కాళికా మాత వేషంలో ఉన్న పోస్టర్ విడుదల కాగా, ఇది ఫ్యాన్స్‌కి మంచి ఆనందాన్ని పంచింది. ఇక గ్లింప్స్ అయితే పిచ్చెక్కించాయని చెప్పాలి. ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే షూటింగ్ వడివడిగా సాగిపోతుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ మూవీ షూటింగ్ జరుపుతుండగా, ఈ మూవీకి సంబంధించిన పిక్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ‘పుష్ప’ సెట్స్ నుండి లీకైన పిక్‌గా ఇది తెలుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ చీర కట్టులో కుర్చీలో కూర్చొని ఉన్నాడు.
పుష్ప 2 చిత్రానికి సంబంధించి ఎలాంటి లీక్ బయటకు రాకుండా చిత్ర బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ పిక్ బయటకు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ లీక్ చేసింది ఎవరో అని మేకర్స్ ఆరాలు తీస్తున్నారు. ఇలా పిక్స్ లీక్ చేసిన వారిపై కఠిన శిక్ష తీసుకోనున్నట్టు కూడా సమాచారం. ఈ చిత్రాన్ని సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తుంది. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించనున్నారు. పుష్పని మించి పుష్ప2 చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు