ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి భారీ ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. దాదాపు వెయ్యి కోట్లతో కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అందుకున్న కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కథానాయికగా ఇండోనేషియ నటి చెలేసా ఇస్లాన్ నటిస్తుందని టాక్. అలాగే నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తారని టాక్ నడుస్తుంది. ఆఫ్రీకన్ అడవుల నేపథ్యంలో సాహసికుడి కథగా ఈ చిత్రాన్ని రాజమౌళి కనీవినీ ఎరుగని రీతిలో రూపొంచనున్నాడు.
మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా, ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందా అని ప్రతి ఒక్కరు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదరురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని భారీగానే తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుండగా, సినిమా ప్రారంభం నుంచే దీన్ని హైప్ పెంచే ప్లాన్ చేస్తున్నాడట. గతంలో రాజమౌళి తన సినిమా ప్రారంభించేముందు హీరోలతో కలిసి మీడియాకి పలు విశేషాలు తెలియజేయడం మనం చూశాం. సినిమాకి సంబంధించి మీడియా వాళ్లు అడిగన పలు ప్రశ్నలకి ఆయన సమాధానాలు ఇచ్చేవారు. కాని ఇప్పుడు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. భారీ సెట్ వేసి అందులో ప్రారంభోత్సవం జరపనున్నట్టు తెలుస్తుండగా, అదే సమయంలో సినిమాని ప్రకటిస్తూ ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సినిమా విషయాలని తెలియజేస్తారట.
తెలుగు సంవత్సరం ఉగాది రోజున ఈ ప్రారంభోత్సవం ఉంటుందని తెలుస్తుండగా, ఈవెంట్‌కి ఇండియన్ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు అందరిని రాజమౌళి ఆహ్వానిస్తారట. ఇక ప్రారంభోత్సవం తర్వాత కొన్ని రోజులకి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండగా, దీనిపై పూర్తి క్లారిటీ అయితే రావలసి ఉంది. ఇక ఎస్‌ఎస్‌ఎంబీ29 కోసం మహేష్‌బాబు మేకోవర్ అవుతుండగా, చిత్రంలో హీరోని సరికొత్తగా చూపించనున్నాడట జక్కన్న. మహేష్‌పై లుక్ టెస్ట్ పూర్తి కాగా, ఇందులో ఎనిమిది లుక్స్ ని హోల్డ్ చేశారట. త్వరలో ఒక లుక్‌ని ఫైనల్ చేసి ఆ లుక్‌తో సెట్స్‌పైకి వెళతారని టాక్ నడుస్తుంది.