తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా పాకేలా చేసిన దర్శకుడు ధీరుడు రాజమౌళి. చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో అద్భుతం సృష్టించిన జక్కన్న ప్రస్తుతం జపాన్‌లో ఉన్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో జక్కన్న అండ్ ఫ్యామిలీ అక్కడి వెళ్లారు. అక్కడ రాజమౌళి ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని, పార్ట్ 2 కోసం ఐడియా అయితే ఉందని, అవేంటో ఇప్పుడే చెప్పలేనని రాజమౌళి అన్నాడు. ఇక మహేష్ బాబుతో సినిమాకి సంబంధించిన పలు విషయాలు కూడా చెప్పుకొచ్చాడు.
చిత్ర కథానాయకుడు తప్ప మిగతా ఆర్టిస్టులు ఎవరిని ఎంపిక చేయలేదని అన్నాడు. ఇక మహేష్ బాబును త్వరలో జపాన్ దేశానికి తీసుకువచ్చి పరిచయం చేస్తా అని కూడా అన్నాడు. గత కొద్ది రోజులుగా రాజమౌళి ఫ్యామిలీ జపాన్‌లోనే ఉంటూ అక్కడ సందడి చేస్తున్నారు. అయితే వారికి పెద్ద ప్రమాదం తప్పింది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ చూసి నెటిజన్స్, ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ లో ఉండిపోయారు. జపాన్‌లో వచ్చిన భూకంపం బారి నుంచి తృటిలో తప్పించుకున్నట్టు రాజమౌళి కుమారుడు కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాము ఓ బిల్డింగ్‌లోని 28వ అంతస్తులో ఉన్నామని అప్పుడే మెళ్లిగా భూమి కంపించడం మొదలైందని ఎక్స్ వేదికగా తెలియజేశారు.
జపాన్‌లో ఇప్పుడే భూకంపం ఎలా ఉంటుందో లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశామన్న కార్తికేయ… మేం 28వ అంతస్తులో ఉండగా.. బిల్డింగ్ మెళ్లిగా కదలడం ప్రారంభించిందని చెప్పుకువచ్చాడు. ఇది భూకంపం అని అర్ధం చేసుకుని టెన్షన్ పడ్డాం… కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా వాళ్లు ఏదో చిన్నపాటి వర్షం మాదిరిగా ఫీలయ్యారని పేర్కొన్నాడు. మొదటిసారిగా ఒక భూకంపాన్ని తాను అనుభూతి చెందానని తన స్మార్ట్ వాచ్ లో వచ్చిన వార్నింగ్ ని ఫోటోని కూడా తీసి ఎక్స్‌లో షేర్ చేశాడు కార్తికేయ. మొత్తానికి భూకంపాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేసిన వారు సేఫ్‌గా బయటపడడంతో తెలుగు సినీ ప్రియులు అందరు ఊపిరి పీల్చుకున్నారు.