సూపర్ స్టార్ రజనీకాంత్‌కి దేశ విదేశాలలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం రజనీకాంత్‌ది. చాలా సింపుల్ లైఫ్ గడుపుతుంటారు తలైవా. అందుకే ఆయనకి అభిమానుల సంఖ్య క్రమక్రమంగా పెరగుతూ పోతుంది. రీసెంట్‌గా జైలర్ చిత్రంతో అతి పెద్ద హిట్ కొట్టారు. రజనీకాంత్‌ని పిచ్చిగా ప్రేమించే అభిమానులు ఆయన కోసం ఎన్నో చేశారు. పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్‌గా జరపడం, సినిమా రిలీజ్ అయితే థియేటర్ దగ్గర ఫుల్ హంగామా చేయడం వంటివి చేశారు.
అయితే ఇప్పుడు ఏకంగా ఓ అభిమాని రజనీకాంత్‌ని దేవుడిగా కొలుస్తూ భక్తుడిగా మారిపోయాడు. తను ఆరాధించే హీరోకి గుడి కట్టి పూజలు, అభిషేకాలు చేస్తున్నాడు. గుడిలో 250 కిలోల రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహం క్రింద తన తల్లిదండ్రుల ఫోటో, గణేశుని ఫోటో ఉంచి నిత్యం రజనీకాంత్ విగ్రహానికి హారతులు, అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నాడు. రజనీకాంత్‌ను దేవుడిగా.. తానో భక్తుడిగా మారిపోయి కార్తీక్ చేస్తున్న పూజలకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ గుడి, పూజలు మాత్రం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కుష్బూ, నయనతార, సమంత, నీతి అగర్వాల్ వంటి హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టడం గురించి మనం విన్నాం. ఇప్పుడు ఆ లిస్ట్‌లో రజనీకాంత్ చేరారు.
ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన లీడర్ 170 మూవీతో బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి ముంబయిలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటుండగా, లీడర్ 170 సినిమా 2014 సమ్మర్‌కి రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ వయస్సులో కూడా రజనీకాంత్ ఇలా వరుస సినిమాలతో సందడి చేస్తూ అభిమానులని అలరిస్తుండడం విశేషం. రజనీకాంత్ రాజకీయాలలోకి కూడా రావాలని అనుకోగా, ఆయన ఆరోగ్య సమస్యల వలన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు.