Site icon vidhaatha

ర‌జ‌నీకాంత్ ఏంటి.. ఇలా షార్ట్ వేసుకొని టీ అమ్మ‌తున్నాడు… వీడియో వైర‌ల్

ర‌జ‌నీకాంత్ ఏంటి.. ఇలా షార్ట్ వేసుకొని టీ అమ్మ‌తున్నాడు… వీడియో వైర‌ల్సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కి మ‌న‌దేశంలోనే కాదు అంత‌ర్జాతీయంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయ‌న సినిమా కోసం ఎంతో మంది క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. ర‌జ‌నీకాంత్ స్టైల్‌కే వీరాభిమానులు ఉన్నారు. అయితే సినిమాల‌తో కోట్ల ఆస్తులు కూడ బెట్టిన ర‌జ‌నీకాంత్ షార్ట్ వేసుకొని టీ అమ్ముతున్నాడు. ఇది చూసి అంద‌రు అవాక్క‌వుతున్నారు. అంత పెద్ద స్టార్ ఇలా టీ అమ్మ‌డ‌మేంటి. అస‌లు ర‌జనీకాంత్‌కి టీ అమ్మాల్సిన ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది. ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా ఇలా చేసాడా అని అనేక చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది,

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అందరికి తెలుసు. అందుకు సజీవ సాక్ష్యాలుగా మనం చూసిన వ్యక్తులు.. మనకి మళ్ళీ ఎక్కడో ఎప్పుడో కలిసినట్లు అనిపించ‌డం మ‌న‌కు జ‌రుగుతుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మ‌నిషిని పోలిన మనుషుల‌కి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతూ సందడి చేస్తూ ఉంటాయి. తాజాగా కేరళలోని కొచ్చిన్‌లోని వెంకటేశ్వర హోటల్ యజమాని సుధాకర్ ప్రభు రాత్రికి రాత్రే ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారాడు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ని గుర్తు చేసే విధంగా సుధాకర్ కి ఉన్న అసాధారణ పోలికను గుర్తించిన అభిమానులు అత‌నిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అచ్చం ర‌జ‌నీకాంత్ మాదిరిగానే అత‌ని లుక్ ఉంది.

కేరళలో ఒక స్టాల్‌లో టీ అమ్ముతున్న సుధాకర్ లెజెండరీ నటుడిగా కనిపించ‌డం చూసి అంద‌రు షాక‌య్యారు. బ‌ట్ట‌త‌ల‌, తెల్లగ‌డ్డం అన్ని కూడా ర‌జ‌నీకాంత్ పోలిక‌లే. సుధాకర్ వీడియోలు ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.నాదిర్షా అనే మలయాళ దర్శకుడు సుధాక‌ర్‌కి సంబంధించిన వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో అతని వీడియోలు వైరల్‌గా మారాయి. అప్పటి నుండి, అతను మరింత ఫేమస్ అయ్యాడు. దీంతో కేరళలోని వివిధ కార్యక్రమాలకు అతడిని ఆహ్వానించడం మొదలు పెట్టారు.

Exit mobile version