Site icon vidhaatha

Klin Kaara | మెగా ప్రిన్సెస్‌ క్లీంకార ఫేస్‌ చూశారా..? తొలిసారిగా తిరుపతి శ్రీవారి సన్నిధిలో రివీల్‌..!

Klin Kaara | మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌-ఉపాసన దంపతులకు కూతురు క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. పుట్టిన నాటి నుంచి క్లీంకార ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేసిన క్లీంకార ఫేస్‌ కనిపించకుండా ఎమోజీలు పెడుతూ వచ్చారు. పుట్టిన నాటి నుంచి క్లీంకార ముఖాన్ని చూడాలని మెగా అభిమానులు అనుకున్నారు. కానీ, వారి కోరిక ఎట్టకేలకు నెరవేరింది. రాంచరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శానికి వెళ్తున్న సమయంలో ఉపాసన ఒడిలో ఉన్న క్లీంకార ఫేస్‌ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ వీడియో సోషల్‌ మీడియా పోస్టు చేయగా వైరల్‌గా మారింది. క్లీంకార ఫేస్ చూసిన మెగా అభిమానులు ఎంత క్యూట్‌గా ఉందంటూ స్పందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నది. మరో వైపు రాంచరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఓ వైపు సినిమా అప్‌డేట్స్‌, మరో వైపు ఫ్యాన్స్‌ పోస్టులతో టైంలైన్‌ అంతా రాంచరణ్‌ మేనియా కనిపిస్తున్నది. రాంచరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీలో నటిస్తున్నది. ఈ చిత్రం నుంచి ‘జరగండి’ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా మూవీ రానుండగా.. ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. చరణ్ ఈ మూవీలో డబుల్‌ రోల్‌లో కనిపించనుండగా.. రాజకీయ నాయకుడిగా, ఐపీఎస్‌ పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తున్నది.


Exit mobile version