మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పాకింది. రామ్ చరణ్ సినిమాలపై హలీవుడ్ ప్రముఖులు సైతం ఓ లుక్కేస్తున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న చరణ్ ఈ మూవీతో మరో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు. చిత్రం కోసం గత కొద్ది రోజులుగా చాలా కష్టపడుతున్నాడు. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషించనున్నాడని, పొలిటికల్ నేపథ్యంలో మూవీ రూపొందనుందని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ తన భార్య ఉపాసనని కూతురు క్లింకారని కూడా అక్కడికి తీసుకెళ్లిపోయారు.
మంగళవారంతో మూవీ చిత్రీకరణ పూర్తి కావడంతో వైజాగ్ బీచ్‌లో రామ్ చరణ్ తన కూతురు క్లింకార, భార్య ఉపాసనతో కలిసి సరదాగా గడిపాడు. మార్నింగ్ సన్‌రైజ్ ని చూస్తూ.. క్లీంకారతో చరణ్ చిన్నపిల్లాడిలా మారిపోయి ఆడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ పోస్ట్ మెగా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ ఒక పక్క నటుడిగా తన కర్తవ్యం నిర్వర్తిస్తూనే, మరో పక్క తండ్రిగా కూడా తన డ్యూటీస్ చేస్తుండడం చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
ఇక రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ వైజాగ్ షెడ్యూల్ పూర్తి కాగా, 21వ తారీఖు నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు శంకర్. ఇక ఈ రోజు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోవు RC16 పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు కొన్నాళ్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ మూవీని పాన్ ఇండియా చిత్రంగా రూపొందించనున్నట్టు సమాచారం. ఇక చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.