తండ్రి పేరుని నిలబెట్టడమే కాక ఆయనని మించి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంటున్నాడు రామ్ చరణ్. కెరీర్‌లో విభిన్న కథా చిత్రాలు చేస్తున్న రామ్ చరణ్‌కి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. చివరిగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ఇందులో రామ్ చరణ్ నటనకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అయితే తెలుగు-తమిళంతో పాటు హిందీ బెల్ట్ లో అసాధారణ విజయం సాధించిన ట్రిపుల్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ ప్రదర్శించిన అసమాన నటనకి ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్ ఛాయిస్ అవార్డులు అందుకున్నారు. `పాప్ గోల్డెన్ అవార్డ్ 2023`లో “గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్`గా రామ్ చరణ్ అవతరించాడు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ నటనతో పాటు నాటు నాటులో అతడి నర్తనకు కూడా ఈ గుర్తింపు దక్కిందని భావించాలి. కళాకారుడిగా, ఫ్యామిలీమ్యాన్ గా.. వ్యవస్థాపకుడిగా అతని బహుముఖ పాత్రలలో అద్భుతమైన విజయాన్ని సాధించిన చరణ్ కి 2023 గొప్పగా కలిసొచ్చింది అని చెప్పవచ్చు. షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనె వంటి వారిని దాటుకుని ఆయన అంతర్జాతీయ అవార్డుని సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ అరుదైన గౌరవం, గుర్తింపు దక్కగానే రామ్ చరణ్‌కి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం వెల్లువెత్తుతుంది.
కింగ్ ఈజ్ కింగ్ -ది గ్లోబల్ హార్ట్‌త్రోబ్ రామ్ చరణ్“ అంటూ ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. `పాప్ గోల్డెన్ అవార్డ్ 2023`లో రామ్ చరణ్‌కి గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా పట్టం కట్టినందున ఇప్పుడు ఆయన శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి కొన్ని లీకులు బయటకు రాగా, అందులో చరణ్ లుక్ చూసి అందరు స్టన్ అవుతున్నారు.