Site icon vidhaatha

ఆ న‌టుడిని కాలితో త‌న్నిన రామ్ చ‌ర‌ణ్‌.. విష‌యం తెలుసుకొని అంద‌రు షాక్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంత పెద్ద స్టార్ హీరో అయిన కూడా ఎంత ఒదిగి ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ల‌కుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతుంటారు. రామ్ చ‌ర‌ణ్‌తో పని చేసిన చాలా మంది కూడా ఆయ‌న గురించి మంచే చెబుతారు తప్ప ఏ నాడు నెగెటివ్‌గా మాట్లాడింది లేదు. తన వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానుల మ‌న‌సులు కొల్ల‌గొట్టిన రామ్ చ‌ర‌ణ్ గురించి తాజాగా ఓ న‌టుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట వైర‌ల్‌గా మారింది. రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మూవీలో హీరోగా నటిస్తున్న న‌టుడు ‘సూర్య’.. గేమ్ ఛేంజర్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు.

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజ‌ర్‌లో రామ్ చరణ్ ఆపోజిట్ గ్యాంగ్ లో నవీన్ చంద్ర ఫ్రెండ్ గా సూర్య కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అయితే చిత్రంలో రామ్ చరణ్ అండ్ సూర్య మధ్య ఓ యాక్షన్ సన్నివేశం ఉంటుందట. ఆ సన్నివేశంలో సూర్యని రామ్ చరణ్ కాలితో తన్నితే సూర్య బౌన్స్ అయ్యి ఎగిరి ఎక్క‌డో ప‌డిపోతాడ‌ట‌. ఆ సీన్ కోసం చాలా టేక్స్ తీసుకోవ‌ల్సి వచ్చింద‌ని సూర్య అన్నాడు. ఆ సీన్ చిత్రీకరించడం కోసం దాదాపు పది టేక్స్ పైగా ప‌ట్టాయ‌ని, ప్ర‌తి టేక్‌లో కూడా రామ్ చ‌ర‌ణ్‌.. త‌న‌ని కాలితో త‌న్న‌డం, షాట్ అయిపోగానే వ‌చ్చి న‌న్ను పైకి లేపి, దుమ్ము దులిపి సారి చెబుతూనే ఉన్నారు రామ్ చ‌ర‌ణ్ అని సూర్య చెప్పుకొచ్చాడు.

రామ్ చ‌ర‌ణ్ చాలా మంచి మ‌నిషి. మ‌న‌సు ఉన్న వ్య‌క్తి. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు కాదు, తండ్రిని మంచిన త‌న‌యుడు అంటూ రామ్ చ‌ర‌ణ్‌పై ప్ర‌శంసల జ‌ల్లు కురిపించారు. ఇక రామ్ మూవీ ద‌ర్శ‌కుడు కూడా రామ్ చ‌ర‌ణ్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. చ‌ర‌ణ్ ఏ పాత్రకి అయినా న్యాయం చేయగలరని ఓ ద‌ర్శ‌కుడిగా చెప్ప‌గ‌ల‌ను. ఏ కథకి అయినా రామ్ చరణ్ గారు సెట్ అయ్యేలా మౌల్డ్ అయ్యిపోతారు అని ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక హీరోయిన్ ధ‌న్య బాలకృష్ణ మాట్లాడుతూ.. “చిరంజీవి గారి లెగసీని ముందుకు తీసుకు వెళ్లే సరైన వారసుడు రామ్ చ‌ర‌ణ్ అంటూ ఆమె ప్ర‌శంస‌లు కురిపించింది.

Exit mobile version