నిజంగా ఈమె ర‌మ్య‌కృష్ణేనా.. ఈ వ‌య‌స్సులో కూడా ఇంత యంగ్‌గానా..!

  • Publish Date - March 25, 2024 / 10:17 AM IST

టాలీవుడ్‌కి ఎంతో మంది హీరోయిన్స్ వ‌స్తున్నారు, పోతున్నారు. కాని కొంద‌రు మాత్రం ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల్లో అలా రిజిస్ట‌ర్ అయి ఉంటున్నారు. తరాలు మారుతున్నా ప్రభావాన్ని కోల్పోకుండా అలా గుర్తుండిపోతున్నారు. అలాంటి వారిలో డైన‌మిక్ లేడి ర‌మ్య‌కృష్ణ ఒక‌రు అని చెప్పాలి. నాలుగు దశాబ్ధాలుగా ఈ భామ సంద‌డి చేస్తూనే ఉంది. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించిన రమ్య‌కృష్ణ ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్‌తోను త‌న‌దైన ముద్ర వేసుకుంటుంది. ‘వెళ్ళై మనసు’ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌మ్య ‘భలే మిత్రులు’ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి దాదాపు 300లకు పైగా సినిమాలు చేసింది. సాత్‌,నార్త్‌ని ఓ రేంజ్‌లో ఊపేసింది

ఎంతో మంది స్టార్ హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది ర‌మ్య‌. ‘బాహుబలి’లో శివగామి దేవిగా న‌టించి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యారు. అప్పటి నుంచి రమ్య పాన్ ఇండియా చిత్రాల్లో భాగం అవుతూ త‌న హ‌వాని చూపిస్తూనే ఉంది. నాలుగు దశాబ్దాలకు పైగానే ఏకధాటిగా సినిమాలు చేస్తూ వ‌స్తున్న ర‌మ్య‌కృష్ణ మ‌ధ్య మ‌ధ్య‌లో ప‌లు టీవీ షోస్‌లోను మెరుస్తూ సంద‌డి చేస్తుంది. మధ్య ఆహాలో స్ట్రీమింగ్ అయిన ‘డ్యాన్స్ ఐకాన్’ అనే షోకు జడ్జ్‌గానూ వ్యవహరించారు. ఓ సారి బిగ్ బాస్ షోని కూడా హోస్ట్ చేసింది. ఇలా ఏదో ర‌కంగా ఫ్యాన్స్‌ని అల‌రిస్తూనే ఉంది రమ్య‌. ప్ర‌స్తుతం రమ్యకృష్ణ తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

ఇక సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది ర‌మ్య‌కృష్ణ‌. తాజాగా త‌న లేటెస్ట్ లుక్స్‌కి సంబంధించిన కొన్ని ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. స్లీవ్ లెస్ టాప్ లో ర‌మ్య‌కృష్ణ అదిరిపోయింది. మెరిసిపోతున్న చర్మ సౌందర్యంతోనూ, యంగ్ లుక్ తోనూ ప్ర‌తి ఒక్కరిని ఆక‌ట్టుకుంటుంది. 53 ఏళ్ల వ‌య‌స్సులోను ఇంత ప్రకాశవంతమైన అందంతో చూపుతిప్పుకోకుండా కుర్రాళ్ల‌లో అల‌జ‌డి రేపుతుంది రమ్య‌. ఇలా ర‌మ్య‌కృష్ణ‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. ఈ వ‌య‌స్సులోను ఇంత గ్లామ‌ర్ ఏంటి అని ఆమె క్యూట్ పిక్స్‌కి నాటీ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి

Latest News