Site icon vidhaatha

ఏంటి ర‌ష్మీ గౌత‌మ్ పోర్న్ సినిమా చేసిందా..యూట్యూబ్‌లో చూసి షాక్..!

న‌టిగా కంటే యాంక‌ర్‌గానే ర‌ష్మీ గౌత‌మ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన ర‌ష్మీ ఇక అక్క‌డ నుండి వ‌రుస టీవీ షోలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఈ అమ్మ‌డు ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. తన నాన్నది ఉత్తర ప్రదేశ్‌ అని, అమ్మది ఒరిస్సా అని చెప్పుకొచ్చిన ర‌ష్మీ గౌత‌మ్.. 2002లో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చినట్టు పేర్కొంది. తొలిసారి థ్యాంక్స్ అనే సినిమా చేయ‌గా, అందులో వినిత్‌, శ్రీనాథ్‌ హీరోలుగా నటించారని పేర్కొంది. సినిమా క‌థ బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఎందుకో ఆడ‌లేదు. సినిమాని పెద్ద‌గా ప్ర‌మోట్ చేయ‌ని కార‌ణంగానే ఆ సినిమా ఎప్పుడు వ‌చ్చి ఎప్పుడు వెళ్లిందో ఎవ‌రికి తెలియ‌లేద‌ని ర‌ష్మీ పేర్కొంది.

జ‌బ‌ర్ధ‌స్త్ షోతో త‌న‌కు పాపులారిటీ రావ‌డంతో తన గత చిత్రాలను యూట్యూబ్‌లో ట్రెండ్‌ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. అయితే యూట్యూబ్‌లో కొన్ని థంబ్ నెయిల్స్ మాత్రం దారుణాతి దారుణంగా ఉంటున్నాయి. ర‌ష్మీ హాట్ సాంగ్ చూశారా అని కొంద‌రు, ర‌ష్మీ పోర్న్ మూవీ అని ఇంకొంద‌రు థంబ్ నెయిల్ పెట్టార‌ట‌. అది చూసి తాను షాక్ అయిన‌ట్టు పేర్కొంది ర‌ష్మి. అస‌లు సినిమా ఏంటి, వాళ్లు పెట్టిందేంటి, నాకేమి అర్ధం కాలేదు. చాలా బాధ అనిపించింద‌ని ర‌ష్మి తెలియజేసింది. వ్యూస్ కోసం అలా చేయ‌డం నిజంగా త‌న‌కు ఆవేద‌న క‌లిగించిందంటూ ర‌ష్మీ స్ప‌ష్టం చేసింది. ఇక సోషల్‌ మీడియాలో చాలా కామెంట్స్ వ‌స్తుంటాయి. అవి నేను పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ని తెలిపింది.

ఏంటి ర‌ష్మీ గౌత‌మ్ పోర్న్ సినిమా చేసిందా..యూట్యూబ్‌లో చూసి షాక్..!ఇక నేను బోల్డ్ సీన్లు చేస్తే కొందరికి నచ్చుతాయి. ఫ్యామిలీ సీన్లు చేస్తే కొందరికి నచ్చుతాయి. అందుకే ఒక్కో మూవీని ఒక్కోలా చేసుకుంటూ వెళ‌తాను. కామెంట్స్‌ని ప‌ట్టించుకుంటే మైండ్ క‌రాబ్ అవుతుంది. మ‌న ప‌ని మ‌నం చేసుకుంటూ వెళ్లాలి .. సినిమా కంటే టీవీనే బెటర్‌ అని ఫిక్స్ అయిన ర‌ష్మీ ఇప్పుడు బుల్లితెర‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తుంది. ప్రస్తుతం రష్మీ గౌతమ్.. ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్‌గా చేస్తుంది. అడపాద‌డ‌పా సినిమాల‌లో కూడా క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది. ఇటీవల భోళా శంకర్‌ ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసి కనువిందు చేసిన విష‌యం విదిత‌మే.

Exit mobile version