బుల్లితెరపై క్రేజీ కపుల్ జంటగా సుధీర్- రష్మీ జంటని చెప్పవచ్చు. వారిద్దరు కలిసి కనిపిస్తే ప్రేక్షకుల రెస్పాన్స్ మాములుగా ఉండదు. సుధీర్ హీరోగా మారాక బుల్లితెరపై కనిపించడం మానేశాడు. ఈ క్రమంలో రష్మి-సుధీర్ జంటగా కనిపించడం లేదు. అయితే వారిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని ఎప్పటి నుండో జోరుగా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాటిని ఇద్దరు ఖండిస్తూ వస్తున్నారు. తామిద్దరం కేవలం స్నేహితులమని చెప్పుకొస్తున్నారు. అయితే వారెన్ని చెప్పిన సుధీర్- రష్మీల పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది.
రష్మి గౌతమ్.. నాలుగు పదులకి దగ్గరగా ఉండగా, ఈ మధ్య ఆమె పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేసింది. తనకు పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో స్పందించిన రష్మి.. త్వరలోనే కాబోయే వాడిని పరిచయం చేస్తానని, పెళ్లి కబురు చెబుతానని వెల్లడించింది. ఈ మేరకు పెళ్లి పార్టీ పేరుతో ఓ గ్లింప్స్ విడుదల చేసారు. ఇయర్ ఎండ్ స్పెషల్‌గా ప్రసారం కానున్న పెళ్లి పార్టీ స్పెషల్ ఈవెంట్ ప్రోమోలో హైపర్ ఆది.. కాబోయే వాడిని పరిచయం చేస్తా అన్నావు? నువ్వు చేసుకోబోయే వాడు ఎలా ఉంటాడో మేమూ చూడాలనుకుంటున్నాం అని అడగడంతో సిగ్గులతో ముగ్గేసిన రష్మి గౌతమ్ ఎట్టకేలకు ఆమె చేసుకోబోయే వాడిని చూపించింది. సర్‌ప్రైజ్ చేసింది.
సుధీర్ కన్నా అందంగా,నిజంగానే కాబోయే భర్తని పరిచయం చేసిందిగా…!ముందుగా కాబోయే వాడి గురించి చెబుతూ, `ప్రతి అమ్మాయికి కాబోయే వాడి గురించి ఒక ఇమాజినేషన్ ఉంటుంది. చేసుకునేవాడు ఇలా ఉండాలి, అలా ఉండాలని అనుకుంటారు. పొడుగ్గా ఉండాలనుకుంటారు అని చెబుతున్న సమయంలో ఆ వ్యక్తి స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. క్లీన్ షేవ్‌లో, హైట్ పర్సనాలిటీతో రొమాంటిక్ బాయ్‌లా ఉన్నాడు. పిల్లి కళ్లు, పూర్తి వైట్‌గా ఉన్న ఆ వ్యక్తి ఫారెన్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. మంచి హ్యాండ్సమ్ అని చెప్పొచ్చు. అందరిని ఆయనకు పరిచయం చేసింది. స్టేజ్‌పైనే కాబోయే వాడిని చూస్తూ ఉండిపోయింది …ఆమె కళ్లల్లో ప్రేమ, ముఖంలో ఆనందం కనిపిస్తుంది. రష్మి పరిచయం చేసిన వ్యక్తి.. హైట్ పర్సనాలిటీలో సుడిగాలి సుధీర్‌ని మించి ఉండగా, ఈ వ్యక్తినే చేసుకో అని కొందరు సలహాలు ఇస్తున్నారు. మరి రష్మీ నిజంగా ఆ వ్యక్తిని వివాహం చేసుకుంటుందా లేకుంటే చివరికి ఫ్రాంక్ చేస్తుందా అనేది చూడాలి.