Site icon vidhaatha

Nellore Cow | ఆ నెల్లూరు ఆవు ప్ర‌పంచ‌లోనే అత్యంత ఖ‌రీదైన‌ది..? ధ‌ర ఏకంగా కోట్ల‌లోనే..!

Nellore Cow | భార‌త‌దేశంలో ఆవుల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆవుల‌ను దేవుడితో స‌మానంగా పూజిస్తారు. ఈ ఆవుల్లోకెల్లా నెల్లూరు ఆవులు అత్యంత ప్ర‌సిద్ధి. నెల్లూరు ఆవుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా క్రేజీ ఉంటోంది. ఇప్పుడు ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా నెల్లూరు ఆవు వార్త‌ల్లో నిలిచింది. తాజాగా వేసిన వేలంలో ఈ నెల్లూరు ఆవు రూ. 40 కోట్ల‌కు ప‌లికింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బ్రెజిల్ దేశంలో ఒంగోలు జాతి ఆవుల‌ను బాగా ఇష్ట‌ప‌డుతారు. ఎందుకంటే ఈ జాతి ఆవు ఎటువంటి వాతావరణానికైనా తట్టుకోగలదు. ఈ ఆవు తెల్లగా, మెరుస్తూ ఉంటుంది. మూపురం కూడా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఒంగోలు జాతి ఆవులు అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకొగలవు. దీనితోపాటు వీటి చర్మం దృడంగా ఉండటం వలన రక్తం పీల్చే కీటకాలను తట్టుకుని ఈ ఆవులు జీవించ‌గ‌ల‌వు. ఇవి పాలు కూడా ఎక్కువగా ఇస్తాయి. దీంతో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక మూలకాలు ఈ ఆవు పాలలో ఉన్నాయి.

అయితే బ్రెజిల్‌లో నిర్వ‌హించిన ప‌శువుల వేలంలో వియాటినా -19 ఎఫ్ఐవీ మారా ఇమూవీస్ అనే ఆవు కొత్త రికార్డు సృష్టించింది. ఆ వేలంలో 4.8 మిలియ‌న్ డాల‌ర్లు ప‌లికి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో దీని ధ‌ర రూ. 40 కోట్లు. ఇది ఇప్పటివరకు విక్రయించబడిన అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ ప్రత్యేక ఆవు జాతి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ఒంగోలు జిల్లా ప్రాంతాల్లో నుండి ఉద్భవించింది. ఈ జాతి ఆవులు, గిత్తలను ఆ ప్రాంతాల నుంచి బ్రెజిల్‌కు తొలిసారిగా 1868లో స‌ముద్ర మార్గంలో ఓడ ద్వారా రవాణా చేయబడ్డాయి. 1960ల‌లో మ‌రిన్ని ఆవుల‌ను బ్రెజిల్‌కు త‌ర‌లించారు.

Exit mobile version