పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సినిమాలకి దూరంగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకి అందుబాటులోనే ఉంటుంది. అయితే రీసెంట్‌గా `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంతో ప్రేక్షకులని పలకరించి అలరించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత రేణూని వెండితెరపై చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రేణూ దేశాయ్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ వస్తుంది. తాజాగా జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించింది.
తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో అకీరానందన్ బర్త్ డే సమయంలో నెలకొన్న వివాదంపై క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ పేరుతో ప్రతి సారి కూడా తమని టార్గెట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా మాట్లాడాలంటే ఆయనని విమర్శించవచ్చు. ఆయన మేనిఫెస్టోని తప్పు పట్టవచ్చు. అలానే పొలిటికల్‌గా ఆయన చేసే పనులని ప్రశ్నించవచ్చు. అంతేకాని ప్రతిసారి కూడా నన్ను, నా పిల్లలని ఇందులోకి లాగడం ఏంటని రేణూ దేశాయ్ ప్రశ్నించింది. ఇటీవల ఇది మరీ ఎక్కువైందని, దీనికి పులిస్టాప్ పెట్టాలంటూ రేణూ దేశాయ్ హెచ్చరించింది. పరోక్షంగా రేణు దేశాయ్ వైసీపీ నాయకులకు గట్టి కౌంటర్ అయితే ఇచ్చింది.
ఇక పవన్‌ని పదే పదే మూడు పెళ్లిళ్లు అనే మ్యాటర్ తెస్తూ వైసీపీ నాయకులు విమర్శిస్తున్న నేపథ్యంలో రేణూ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు మహిళలపై చేసే కామెంట్స్‌పై కూడా రేణూ దేశాయ్ స్పందిస్తూ..అమ్మాయిల లుక్‌పై కామెంట్ చేయవచ్చు, యాక్టింగ్‌పై కూడా చేయవచ్చు. అందులో తప్పులేదు. అంతేకాని క్యారెక్టర్ పైకి వెళుతున్నారని మండిపడింది. ఎంత మందితో పడుకుంది, ఇలా చేసింది, అలా చేసిందని క్యారెక్టర్ పై కామెంట్స్ చేయడం చాలా తప్పు. అలాంటివి మానుకోవాలంటూ రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రేణుదేశాయ్ కామెంట్స్ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇదిలా ఉంటే రేణు దేశాయ్ `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంలో హేమలత లవణం పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.