Site icon vidhaatha

మా విడాకుల ఇష్యూ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్.. ప‌వన్ గురించి నేను ఏమి మాట్లాడ‌న‌న్న రేణూ దేశాయ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్పుడ‌ప్పుడు అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కి సమాధానాలు ఇస్తుంటుంది. అయితే ఇప్పుడు ఆమె టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న నేప‌థ్యంలో మీడియా రేణూ ఇంట‌ర్వ్యూల కోసం ఎగ‌బ‌డుతుంది. ఆమె నుండి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది. తాజా ఓ ఇంటర్వూలో రేణూ దేశాయ్ త‌న రెండో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. పవన్‌తో విడిపోయిన తర్వాత ఓ వ్యక్తితో ఎం‌గేజ్‌మెంట్ చేసుకున్న ఆమె కొద్ది రోజుల త‌ర్వాత అత‌నితో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. ఇక రెండో పెళ్లికి సంబంధించి రెండేళ్ల త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటాన‌ని పేర్కొంది.

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన రేణూ దేశాయ్.. ఆయ‌న గురించి మాట్లాడి స‌మ‌స్య‌లు తెచ్చుకోవాల‌ని లేదు, ఇంటర్వ్యూలో ఆయన గురించి ఏమైన మాట్లాడితే నా మీద ప‌డ‌తారు. ఈవిడకి ఏం పనిలేదు.. ప్రతి ఇంటర్వ్యూలో మాజీ భర్త గురించే మాట్లాడుతుంది అంటూ న‌న్ను ట్రోల్ చేస్తుంటారు. న‌న్ను తిట్టేవాళ్ల‌కి ఛాన్స్ ఇవ్వ‌డం ఎందుకు.. మాట్లాడుకుండా ఉంటే నాకే మంచిది క‌దా, ఇప్ప‌టికే బోలెడన్ని కాంట్ర‌వ‌ర్సీలు వ‌చ్చాయి అని రేణూ దేశాయ్ పేర్కొంది. ఇక జీవితంలో అంద‌రికి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. నాకు ఒక్క‌దానికే కాద‌ని పేర్కొంది.

ఇక చాలా మంది డోర్ వెన‌క ఉండి ఏడ్చేవాళ్లు అని చెప్పిన రేణూ దేశాయ్.. డబ్బు వల్ల జాయ్, సెక్యురిటీ ఉంటుందేమో కానీ.. ప్రాబ్లమ్ లేకుండా ఉండదు అనేది అవాస్త‌వం. దుఖంలో ఉన్నప్పుడు ఏదో కోల్పోయానని బాధపడి ఉంటే ఇప్పుడు ఇంత సంతోషంగా ఉండేదానిన కాదు. జీవితం అంద‌రికి ఒక గుణ‌పాఠం నేర్పిస్తుంది. దాని నుండి కొంద‌రు నేర్చుకుంటారు, మ‌రి కొంద‌రు నేర్చుకోరు. నా జీవితంలో మంచి గ‌డియ‌లు అంటే నా స్కూల్ లైఫ్ మ‌రియు పిల్లలు పుట్టిన త‌రువాత జీవితం.ఇక సాండ్ మూమెంట్ అంటే నా ఫ్యామిలీలో కొంతమంది చనిపోవడం, హెల్త్ ఇష్యూస్‌..ఇక నా విడాకుల ఇష్యూ అయితే వరల్డ్ ఫేమస్ కాగా, విడాకులు తీసుకున్న పీరియడ్ అయితే నా లైఫ్ లో వెరీ సాడ్ అంటూ రేణూ స్ప‌ష్టం చేసింది

Exit mobile version