Site icon vidhaatha

రిష‌బ్ పంత్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా రీఎంట్రీ

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ గత కొంత కాలంగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విష‌యం తెలిసిందే. డిసెంబర్ 2022లో ఘోరమైన కారు ప్రమాదానికి గురైన పంత్, అప్ప‌టి నుండి క్రికెట్‌కి దూరంగా ఉంటూ వ‌స్తున్నాయి. ఏడాదికి పైగా క్రికెట్‌కి దూరంగా ఉన్న పంత్ ఇప్పుడు మ‌ళ్లీ బ్యాట్ చేత‌ప‌ట్టి తిరిగి జ‌ట్టులో స్థానం కోసం కృషి చేస్తున్నాడు. అయితే పంత్ ఇప్పుడు ఐపీఎల్ 2024 సీజ‌న్ తో గ్రౌండ్ లోకి అడుగుపెట్ట‌బోతున్నట్టు తెలుస్తుంది . కర్ణాటకలోని ఆలూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ప్రాక్టీస్ గేమ్‌లో పాల్గొన్న రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో పునరాగమనానికి సిద్ధంగా ఉన్నట్టు అర్ధ‌మ‌వుతుంది.

చూస్తుంటే 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా, స్పెషలిస్ట్ బ్యాట్స్ మ‌న్ గా రిష‌బ్ పంత్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లోకి అడుగుపెట్టి అద‌ర‌గొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. పంత్ గ‌త‌లో క‌న్నా కూడా చాలా పురోగ‌తిని సాధించాడు. 26 ఏళ్ల ఈ యంగ్ ప్లేయ‌ర్ మంచి చురుకుద‌నం, చాలా ఈజీగా షాట్స్ ఆడుతూ మ‌ళ్లీ పాత పంత్‌ని గుర్తుకు తెస్తున్నాడు. రిషబ్ పంత్ ఐపీఎల్లోకి పునరాగమనం గురించి మాట్లాడిన రికీ పాంటింగ్, ఇండియన్ స్టార్ ఐపీఎల్ లో ఆడటానికి చాలా ఆసక్తిగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. అత‌డు త్వరలో జరగనున్న రెండు కీలక టోర్నీల్ని టార్గెట్‌గా పెట్టుకున్న‌ట్టు తెలుస్తుంది. ముందు ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో అద్భుతంగా రాణించి ఆ త‌ర్వాత యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 వరల్డ్ కప్ లోను అద‌ర‌గొట్టాల‌ని భావిస్తున్నాడు.

తాజాగా జ‌రిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ ను చూసిన వారంతా ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పంత్ దిగి అద‌ర‌గొట్ట‌డం ఖాయం అని అంటున్నారు. ఇప్పటికే తాను ఐపీఎల్ టోర్నీ మొత్తం ఆడేందుకు పంత్ సిద్ధంగా ఉన్నట్లు రికీ పాటింగ్ కూడా వెల్లడించాడు. దీంతో పంత్ పై అంచనాలు భారీగా పెట్టుకున్నారు ఫ్యాన్స్. పంత్ ఈ సారి ఐపీఎల్‌లో స‌త్తా చాటితే ఇక టీమిండియాలో చోటు ద‌క్క‌డం ఖాయంగా చెప్ప‌వ‌చ్చు.

Exit mobile version