ఒకప్పుడు సినిమాలలో నటించే స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాస్త అందాల ఆరబోతతో రచ్చ చేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. బుల్లితెరపై సందడి చేసే భామలు కూడా కేక పెట్టించే అందాలతో కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. జబర్ధస్త్ షోతో పాపులారిటీ సంపాదించుకున్న రీతూ చౌదరి ఇటీవల సోషల్ మీడియాలో గ్లామర్ షోతో నానా రచ్చ చేస్తుంది. ఈ భామ అందచందాలకి తన్మయత్వం చెందని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కెరీర్ బిగినింగ్ లో సీరియల్స్ చేసిన రీతూ చౌదరి, అక్కడ బ్రేక్ రాకపోవడంతో జబర్దస్త్ కి షిఫ్ట్ అయ్యింది. హైపర్ ఆదితో పాటు కొందరు టీమ్ లీడర్స్ స్కిట్స్ లో నటించి అలరించింది.
కొన్నాళ్లుగా ఈ భామ ఇన్‌స్టా వేదికగా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ థ్రిల్ చేస్తుంది. హీరోయిన్స్‌ని మించి మరి గ్లామర్ డోస్ పెంచుతుంది. పొట్టి బట్టల్లో రీతూ చౌదరి అందాలు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. అమ్మడి అందాలని ఆస్వాదించే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అందుకోసం ఈ భామ తరచుగా ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంది. ఎక్కువ ఎక్స్‌పోజింగ్ చేయడంపై రీతూని చాలానే ట్రోల్ చేస్తుంటారు. చాలా సార్లు రీతూ చౌదరి ఫోటోల క్రింద నెటిజెన్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. అయితే తన బట్టలపై చేసే కామెంట్స్ ని రీతూ అస్సలు పట్టించుకోరు. ఎప్పుడూ రియాక్ట్ అయ్యింది కూడా లేదు. తాజాగా ఓ నెటిజన్ రీతూపై తీవ్ర విమర్శలు చేశాడు. పబ్లిక్ లో కొంచెం హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది రీతూ చౌదరి.
దాంతో ఒళ్లు మండిన రీతూ చౌదరి… పబ్లిక్ లో ఆ ఎక్స్పోజింగ్ ఏంటి? మీ లాంటి వాళ్ళ వలనే దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. కట్టుకున్నవాడికి చూపించాల్సిన అందాలు… పబ్లిక్ గా చూపిస్తున్నావు… అని ఏకిపారేశాడు. మరొక నెటిజన్ అయితే రాయలేని కామెంట్ పెట్టాడు.మరి వీటిపై ఈ అమ్మడు ఏమైన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఇదిలా ఉంటే రీతూ చౌదరి రీసెంట్‌గా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయించింది. మరి సోషల్ మీడియాలో తనపై దారుణమైన కామెంట్స్ చేసే వారిపై కూడా కేసు పెడుతుందా లేదా అనేది చూడాలి.