Site icon vidhaatha

రోజా పుట్టిన రోజు వేడుక‌..మాస్ డ్యాన్స్‌తో స్టేజ్‌పై ర‌చ్చ చేసిందిగా..!

ఒక‌ప్పుడు హీరోయిన్‌గా స‌త్తా చాటిన రోజా ఎన్నో మంచి విజ‌యాల‌ని త‌న ఖాతాలో వేసుకుంది. అయితే పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి గ్యాప్ ఇచ్చిన రోజా జ‌బ‌ర్ధ‌స్త్ జ‌డ్జిగా ప‌లు షోలు చేసింది. ప‌లు ఈవెంట్స్‌లో కూడా సంద‌డి చేసింది. ఎంఎల్ఏగా ఉన్న‌ప్పుడు కూడా ప‌లు షోస్‌తో సంద‌డి చేసిన రోజా మంత్రి అయిన త‌ర్వాత పూర్తిగా ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. కాక‌పోతే సోష‌ల్ మీడియాలో అప్పుడప్పుడు తెగ సంద‌డి చేస్తూ త‌న అభిమానుల‌ని అలరిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్‌గా ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పుట్టినరోజు వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంలోని డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్ పాటకు రోజా అదిరిపోయే స్టెప్పులు వేసి అంద‌రిలో జోష్ నింపారు. అప్ప‌టి జోష్‌తోనే రోజా డ్యాన్స్ వేసి అంద‌రిని ఆక‌ట్టుకుంది. రోజా డ్యాన్స్ చూసి ఆమె అభిమానులు తెగ మురిసిపోయారు. ఇక‌ ఇదే వేడుకలో తన కొడుకుతో కలిసి ముక్కాల పాటకు కూడా డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక రోజా త‌న బ‌ర్త్ డే వేడుక‌కి పలువురు సినీ సెలబ్రిటీస్ ప్రముఖ రాజకీయవేత్తలు ఆహ్వానించింది. కుటుంబ సభ్యులు సన్నిహితుల మ‌ధ్య బ‌ర్త్‌డేనిగ్రాండ్‌గా జ‌రుపుకుంది.

రోజా కుమారుడు లోహిత్ శల్వమణి కూడా డ్యాన్స్ బాగా వేయ‌డంతో రానున్న రోజుల‌లో త‌న త‌న‌యుడిని రోజా వెండితెరకి ప‌ర‌చియం చేయ‌నుందంటూ చ‌ర్చ మొద‌లైంది. ఇక కొద్ది రోజులుగా రోజా కూతురు కూడా సినిమాల‌లోకి వ‌స్తుందంటూ చ‌ర్చ మొద‌లైంది. కాని దీనిపై ఎవ‌రు క్లారిటీ ఇవ్వ‌లేదు. రోజా విష‌యానికి వ‌స్తే ఆమె తెలుగులోనే కాకుండా కన్నడం, తమిళం, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి, కాగా సినిమాల‌లోకి వ‌చ్చాక అలా మార్చుకుంది. ఒక‌ప్పుడు రోజా త‌న గ్లామ‌ర్‌తో కూడా ఓ ఊపు ఊపేసింది. ఇక రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యారు. 2022లో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం సాంస్కృతిక యువజన శాఖ మంత్రిగా రోజా ఎంపిక‌యిన విష‌యం తెలిసిందే.

Exit mobile version