Site icon vidhaatha

Miss Universe | మిస్‌ యూనివర్స్‌ రేసులో తొలిసారిగా సౌదీ అరేబియా అందం..!

Miss Universe | ఈ సారి మిస్‌ యూనివర్స్‌ పోటీలు చాలా ప్రత్యేకంగా మారబోతున్నాయి. ఆ ప్రత్యేకత ఏంటంటే.. తొలిసారిగా ఇస్లామిక్‌ దేశమైన సౌదీ అరేబియాకు చెందిన ఓ మోడల్‌ అందాల పోటీల్లో కనిపించనున్నది. మోడల్‌ రూమీ అల్కహ్తాని సౌదీ అరేబియా తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు. 27 ఏళ్ల రూమీ ఇప్పటికే అనేక అందాల పోటీల్లో పాల్గొంది. రూమీ అల్కహ్తానీ సోషల్ మీడియా పోస్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. రూమీ అల్కహ్తానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి ఒక మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. రూమీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా మిస్ యూనివర్స్ పోటీలో తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ సుందరి అందాల పోటీల్లో అత్యంత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఫ్యాషన్‌ ప్రపంచంలో మిస్‌ యూనివర్స్‌ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.

అయితే, అందాల పోటీల్లో సౌదీ అరేబియా పాల్గొనడం కీలకమైన ముందడుగని పేర్కొంటున్నారు. క్రౌన్‌ ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌద్‌ నాయకత్వంలో సంప్రదాయవాద భావాజాలం తగ్గుతూ వస్తున్నది. రూమీ అల్కహ్తాని మాట్లాడుతూ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో పాల్గొనడం తనకు గౌరవంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలే సౌదీ అరేబియా జెండా పట్టుకొని ఉన్న ఫొటోలును పోస్ట్‌ చేసింది. ఎన్నో పోటీల్లో పాల్గొన్న రూమీ కొద్ది రోజుల కిందట మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియ‌న్‌లో పాల్గొంది. రియాద్‌లో జన్మించిన రూమీ అల్కహ్తానీ మిస్ సౌదీ అరేబియా. మిస్ అరబ్ వరల్డ్ పీస్ 2021, మిస్ ఉమెన్ (సౌదీ అరేబియా) టైటిల్స్‌ను సైతం నెగ్గింది. ఇక ఈ ఏడాది 73 మిస్‌ యూనివర్స్‌ పోటీలు మెక్సికోలో సెప్టెంబర్‌లో జరుగనున్నాయి. ప్రస్తుతం మిస్‌ యూనివర్స్‌గా షెన్నిస్ పలాసియోస్ కొనసాగుతున్నది.

Exit mobile version