బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్‌కి ఉత్తరాదిలోనే కాదు.. దక్షిణాదిలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ రోజు ఆయన 58వ బర్త్ డే. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్‌కి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సల్మాన్‌లో నటుడు మాత్రమే మంచి ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. పెయింటింగ్ పట్ల ఎంతో ప్రేమని పెంచుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు అనేక రకాల పెయింటింగ్స్ వేసి ఎందరో ప్రశంసలు అందుకున్నాడు.
సల్మాన్ ఖాన్ చేతి వేళ్లతో అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. పన్వెల్ లోని తన ఇంటిలో ఎన్నోరకాల పెయింటింగ్స్ వేసిన సల్మాన్ ఖాన్ కొన్ని పెయింటింగ్స్‌ని అమ్మకానికి పెట్టాడు. అవి కోట్లలో అమ్ముడు పోయాయి. ఇక తన సోదరి అర్పితా ఖాన్, బావ ఆయుష్ శర్మకు ఖురాన్ నుంచి ఓ అందమైన కళాకృతిని చేతివేళ్లతో పెయింటింగ్ చేశాడు సల్మాన్ అందుకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.సోదరి కొత్త ఇంటికి మారగా, తమ ఇంట్లో గోడలకి మంచి ఆర్ట్ పీస్ కావాలని బావ ఆయుష్ కోరడంతో స్వయంగా అద్భుతమైన పెయింటింగ్ వేసి షాకిచ్చాడు. చేతులతో సల్మాన్ వేసిన ఆర్ట్ పెయింటింగ్ అదరహో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సల్మాన్ ఖాన్ మూడు దశాబ్దాలకుపైగా కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోగా, ఈ మధ్య కాలంలో మాత్రం సరైన సక్సెస్ లు అందిపుచ్చుకోలేకపోతున్నాడు. చివరిగా సల్మాన్ టైగర్ 3 చిత్రంలో కనిపించాడు. ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది. ఇక సల్మాన్ ఖాన్ వెండితెరపై హీరోగానే కాకుండా వ్యాపారం, టెలివిజన్ పై కూడా సంపాదిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం, సల్మాన్ నికర ఆస్తుల విలువ 3000 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. సల్మాన్ కూడా ఇటు వీటితో పాటు.. రకరకాల బిజినెస్ ల ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు.కాకపోతే ఇప్పటి వరకు ఆయన పెళ్లి చేసుకోకపోవడం అభిమానులని ఎంతగానో బాధిస్తుంది.