Site icon vidhaatha

స‌మంత‌-చైతూని క‌ల‌ప‌బోతున్న ఆ ఒక్క‌డు.. ఎవ‌రత‌ను అంటే..!

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో ఒక‌రిగా ఉండే స‌మంత‌- నాగ చైత‌న్య జంట ఎవ‌రు ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకొని విడిపోయారు. వారి విడాకుల వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు వారిద్ద‌రు ఎందుకు విడిపోయార‌నేది ఎవ‌రికి తెలియ‌క‌పోయిన కూడా ఏవేవో కార‌ణాలు అయితే చెప్పుకొస్తున్నారు. మ‌రి కొంద‌రు అయితే వీరిద్ద‌రు తిరిగి క‌లుస్తారంటూ జోస్యాలు కూడా చెబుతున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైత‌న్య స‌మంత ఒక్కసారి కూడా ఎదురుపడిన సంద‌ర్భం లేదు. ఇప్పుడు మాత్రం వారిద్దరూ ఒక వేడుకలో ఎదురుపడే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం అందుతుంది.

ప్ర‌స్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. వీరి పెళ్లి కోసం ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు ఇటలీకి వెళ్లారు. కొద్ది మందికి మాత్రమే ఈ పెళ్లికి సంబంధించిన ఆహ్వానం అంద‌గా వారిలో నాగ చైత‌న్య‌, స‌మంత కూడా ఉన్న‌ట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ కి చైతు కూడా మంచి ఫ్రెండ్ కాగా, సమంతని కూడా వరుణ్, లావణ్య ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినట్లు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ రోజు జ‌రిగే పెళ్లిలో స‌మంత‌, నాగ చైత‌న్య సంద‌డి చేయ‌నుండ‌గా, విడాకుల త‌ర్వాత తొలిసారి వారిద్ద‌రు ఎద‌రు ప‌డ‌నున్నారు. అయితే వీరిద్దరూ ఏమైన మాట్లాడుకుంటారా ? కలసి కనిపిస్తారా అనే ఉత్కంఠ అభిమానుల్లో మాత్రం చాలా ఉంది.

విడాకుల త‌ర్వాత నాగ చైత‌న్య ఇచ్చిన ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో ఆయ‌న స‌మంత‌పై ఎక్క‌డ కూడా అంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంద‌ర్భం లేదు. తాను స్నేహితుడిగానే ఉంటాన‌ని అన్నాడు. మ‌రి పెళ్లిలో గ్రూప్ ఫొటో దిగాల్సి వ‌స్తే ఈ ఇద్ద‌రు కూడా ఒకే ఫ్రేములో కనిపిస్తారా, లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి రిసెప్ష‌న్ న‌వంబ‌ర్ 5 జ‌ర‌గ‌నుండ‌గా, ఈ వేడుక‌కి కూడా వీర‌ద్ద‌రు హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం. ఇక వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య వివాహానికి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు ఇటలీ బయలుదేరిన‌ట్టు తెలుస్తుంది.

Exit mobile version