Site icon vidhaatha

అభిమానుల‌తో మీటింగ్ పెట్టిన స‌మంత‌… హ‌గ్ చేసుకొని క‌న్నీరు మున్నీరుగా విల‌పించిన అభిమాని

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం సినిమాల‌కి దూరంగా ఉంటున్న విష‌యం తెలిసిందే. మ‌యోసైటిస్ వ‌ల‌న సినిమాల‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన స‌మంత తిరిగి రీఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తుంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది. స‌మంత గ్లామ‌ర్ షోకి సోష‌ల్ మీడియా షేక్ అవుతుండ‌డం విశేషం. అయితే స‌మంత సినిమాలు చేయ‌క‌పోయిన కూడా ఏదో ఒక విధంగా మాత్రం వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. ప‌లు ఈవెంట్స్‌లో పాల్గొన‌డం లేదంటే ఫొటో షూట్స్ చేయ‌డం, సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు పెట్టడం వంటివి చేస్తూ నిత్యం హాట్ టాపిక్‌గా మారుతుంది సామ్. అయితే తాజాగా అమ్మ‌డు కొంద‌రు అభిమానుల‌తో మీటింగ్ పెట్టటింది.

స్వ‌యంగా త‌న అభిమానులంద‌రిని క‌లిసి వారికి ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ప్ర‌తి అభిమానిని పేరు పేరున ప‌ల‌క‌రించ‌డంతో పాటు వారు తెచ్చిన గిఫ్ట్స్‌ని తీసుకొని మురిసిపోయింది. అంతేకాకుండా వారితో క‌లిసి ఫొటోలు దిగింది. ఓ మ‌హిళా అభిమాని అయితే స‌మంత‌ని హ‌గ్ చేసుకొని మ‌రీ ఏడ్చేసింది. స‌మంత‌పై ఎక్క‌డ లేని ప్రేమ చూపించ‌డంతో సామ్ మురిసిపోయింది. ఇక అభిమానుల‌తో చాలా సంతోషంగా గ‌డిపిన స‌మంత ఆ త‌ర్వాత కేట్ క‌ట్ చేసింది. అభిమానుల ప్రేమ‌కి స‌మంత చాలా ఎమోష‌న‌ల్‌గా ఫీల్ అయింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం సమంత ఫ్యాన్ మీట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. సమంతని కలిసిన అభిమానులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమెతో దిగిన ఫోటోలు నెట్టింట పంచుకుంటున్నారు.

ఇక స‌మంత చివ‌రిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషీ అనే సినిమా చేసింది. ఈ సినిమా ఓ మోస్త‌రు విజ‌యాన్ని సాధించింది. ఇక త్వ‌ర‌లో మ‌రో సినిమా చేసేందుకు క‌మిట్ అయిన‌ట్టు స‌మాచారం. ఇక సిటాడెల్ ఇండియ‌న్ వ‌ర్షెన్‌లో స‌మంత న‌టించ‌గా, త్వ‌ర‌లో ఇది అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీని కోసం స‌మంత ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version