త‌ను ప‌డ్డ క‌ష్టాల గురించి ఒక్కొక్క‌టిగా చెప్పుకొస్తున్న స‌మంత‌..ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం

  • Publish Date - March 29, 2024 / 01:38 PM IST

దేశంలోని టాప్-10 కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో స‌మంత ఒక‌రు. ఆమె ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేది. కాని ఈమె మ‌యోసైటిస్ బారిన ప‌డ‌డంతో కాస్త త‌గ్గించింది. త్వ‌ర‌లో సిటాడెల్ ఇండియ‌న్ వ‌ర్షెన్‌తో ప‌ల‌కరించ‌నుంది. అయితే అప్పుడే విడాకులు తీసుకొని డిప్రెష‌న్‌లో ఉన్న స‌మ‌యంలో స‌మంత మ‌యోసైటిస్ బారిన ప‌డింది. ఆ స‌మ‌యంలో ఈ అమ్మ‌డు తీవ్ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర్కొంది. వాటికి సంబంధించిన వివ‌రాలు ఒక్కొక్క‌టిగా చెప్పుకుంటూ వ‌స్తుంది. పాడ్ కాస్ట్‌లో స‌మంత అప్ప‌టి ప‌రిస్థితుల గురించి చెబుతూ.. మయోసైటిస్ కి గురైన‌ప్పుడు తాను తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందద‌ట‌.

ఇక మయోసైటిస్ తర్వాత ఎదురయ్యే సైడ్ ఎఫక్ట్స్ ని అధిగ‌మించ‌డానికి కూడా స‌మంత‌కి చాలా స‌మ‌యం ప‌ట్టింద‌ట‌. సిటాడెల్ వర్క్ షాప్ లో ట్రైనింగ్ సెషన్ నిర్వహించ‌గా, ఆ ట్రైనింగ్ సెషన్ లో నా శక్తి సగానికి త‌గ్గిపోయింది. అప్పుడు నాకు ఆ విష‌యం అర్ధ‌మైంది. అయితే ఆ స‌మ‌యంలో నేను భారీ యాక్షన్ సీన్స్ లో నటించాల్సి వచ్చేది. ఒకవైపు మయోసైటిస్, మరోవైపు గాయాలు ఇలా పూర్తిగా వర్ణించలేని బాధని అనుభవించాన‌నంటూ త‌న బాధ‌లు చెప్పుకొచ్చింది. ఇక త బాడీ త్వరగా హీల్ కావడానికి ఆహారం కూడా తక్కువగా తీసుకునేద‌ట‌. దీంతో త‌న‌లో శ‌క్తి చాలా త‌గ్గిపోయి నీర‌సించిపోయింద‌ట‌. త‌న‌లోని శ‌క్తి 50 శాతం ప‌డిపోగా, ఏ ప‌ని చేయ‌లేన‌ట్టుగా ఉండేద‌ని పేర్కొద‌ని స‌మంత తెలియ‌జేసింది.

ఇక కండరాల నొప్పులు కూడా విప‌రీతంగా ఉండేవి అని సమంత ఆ కఠిన పరిస్థితులని గుర్తు చేసుకుంది. ది. ఓర్పుతో ముందుకు వెళ్లినవారికి కెరీర్ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న స‌మంత ప‌లు సంద‌ర్భాల‌లో ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసి కొంద‌రి ఆగ్ర‌హానికి కూడా గురైంది. విడాకుల త‌ర్వాత ఈ ఇద్దరు ఎదురుప‌డింది లేదు. అయితే నాగ చైత‌న్య మాత్రం స‌మంత గురించి ప‌లుమార్లు ప్ర‌స్తావిస్తూ ఆమెని గొప్ప‌గా పొగిడాడు. వీరిద్ద‌రు తిరిగి క‌లిస్తే చూడాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా స‌మంత నాగ చైత‌న్య విడాకుల‌కి సంబంధించి ఓ వార్త వైర‌ల్ అయింది. ఫోన్ ట్యాపింగ్ వ‌ల్ల‌నే వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చిన‌ట్టు టాక్ న‌డుస్తుంది.

Latest News