టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒకవైపు విడాకులు, మరోవైపు మయోసైటిస్ సమస్య సమంత జీవితం గందరగోళం అయ్యేలా చేసింది. విడాకుల తర్వాత సమంత చాలా స్ట్రాంగ్ కావడంతో మయోసైటిస్‌ని కూడా సులువుగానే జయించింది. అయితే ఏడాది పాటు సినిమాలకి దూరంగా ఉంటానని చెప్పిన సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నది. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ చానెల్లో అభిమానులతో ఆమె ముచ్చటించింది. ఈ సందర్భంగా నాగ చైతన్య పేరు ప్రస్తావించకుండానే గతంలో తన భాగస్వామిగా ఉన్న వ్యక్తి తన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేశాడని, అందుకే తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి తనకు తెలియదని సమంత పేర్కొంది.
ఇంటరాక్షన్ సందర్భంగా ఓ నెటిజన్ సమంతని.. ఒకవేళ మీ వ్యక్తిగత వృద్ధి ఓ హైలైట్ రీల్ అయితే.. అందులో మీరు బాగా నవ్వుకునే బ్లూపర్ ఏది.. అలాగే మీకు జీవిత పాఠం నేర్పిన ఆస్కార్ లెవల్ మూమెంట్ ఏది” అని అడగగా, దానికి సమంత.. చైతూ పేరు చెప్పకుండా ఆయనపై ఇన్‌డైరెక్ట్‌గా నిందలు వేసింది. జీవితంలో చాలా కష్ట సమయంలోనూ నేర్చుకోవడానికి ఎంతో విలువైన పాఠం ఉందని నేను గుర్తించిన క్షణంలో నా వ్యక్తిగత వృద్ధి సాధ్యమైందని సమంత చెప్పుకొచ్చింది. చైతూపై సమంత ఇలాంటి నిందలు వేయడం పట్ల కొందరు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడాకుల తర్వాత సమంత గురించి ఏ నాడు నాగ చైతన్య తప్పుగా మాట్లాడింది లేదు, కాని సమంత మాత్రం ఆయనపై నిందలు వేస్తూనే ఉన్నది.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే గతేడాది శాకుంతలం, ఖుషీ మూవీస్ లలో నటించగా, ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో సమంత మంచి కథలని ఎంచుకొని మరి కొద్ది రోజులలో సినిమా షూటింగ్ ప్రారంభించనుందని సమాచారం. ఇటీవల సమంత చాలా హాట్‌గా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ అమ్మడు ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది.