Site icon vidhaatha

22 నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ రంగంలోకి దిగిన‌ స‌మంత‌.. ఇక ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరైన సమంత రూత్ ప్రభు గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అమ్మ‌డు సినిమాల‌కి దూరంగా ఉంటూ పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. సమంత చివరగా ఖుషి సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా,ఈ సినిమా ఓ మోస్త‌రు విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. అయితే స‌మంత గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటూ అనేక దేశాలు చుట్టేస్తుంది. ఇటీవలే ఓ సినీ నిర్మాణ సంస్థ కూడా స్థాపించింది.

అయితే స‌మంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఆమెకు జోడీగా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ఇటీవల హాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన అమెరికన్ సిరీస్ సిటాడెల్ కి ఇది అఫీషియల్ రీమేక్ కాగా, దీనిని సమంత, మనోజ్ బాజ్ పాయ్ ల ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ మరియు డీకే తెర‌కెక్కిస్తున్నారు.తాజాగా స‌మంత సిటాడెల్ సిరీస్ డబ్బింగ్ వర్క్స్ మొదలుపెట్టింది . సిటాడెల్ కి డబ్బింగ్ చెప్తున్న ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ..ఆస‌క్తిక‌రమైన కామెంట్ పెట్టింది. 22 నెలల తర్వాత ఈ ప్రాజెక్టు రెడీ అయింది అని పోస్ట్ చేసింది. ఇక స‌మంత‌.. రాజ్ & డీకే టీంతో ల్యాప్ టాప్ లో సిటాడెల్ ఎడిటింగ్ వర్షన్ చూస్తున్న పలు ఫోటోలని కూడా షేర్ చేసింది

సిటాడెల్ సిరీస్ యాక్షన్, రొమాంటిక్ గా ఉండనున్నట్టు తెలుస్తుంది.. ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ లో రానుండగా,ఈ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. స‌మంత మ‌ళ్లీ తిరిగి స్క్రీన్‌పై క‌నిపించనుంద‌ని తెలియ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.. ఈ స్పై థ్రిల్లర్ లో సికందర్ ఖేర్, ఎమ్మా కానింగ్, కే కే మీనన్, సాకిబ్ సలీం ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సిరీస్ ఎప్పుడు రిలీజ్ కానుంది అనే దానిపై మేక‌ర్స్ పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. కాగా స‌మంత చివ‌రిగా ఫ్యామిలి మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో క‌నిపించి తెగ సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

Exit mobile version