స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఏ మాయ చేశావే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారింది. మూడేళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగిన మధ్యలో వచ్చిన మనస్పర్ధల వలన విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుండి సమంత తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు బిజినెస్ రంగాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటుంది. ఈమె సాఖీ అనే క్లాతింగ్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. ఇటీవల ట్రాలల అనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు.
నిర్మాతగా మారిన సమంత కొత్త వారికి ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించబోతున్నట్లు వెల్లడించారు. బేబీ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైష్ణవి చైతన్యకు సమంత ప్రొడక్షన్ హౌజ్‌లో ఛాన్స్ దక్కినట్టు ప్రచారం జరిగింది. అయితే మయోసైటిస్ వలన సమంత సినిమాలకి కాస్త దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రాములో ఆస్క్ మీ ఎనిథింగ్ అనే సెషన్ నిర్వహించింది. ఈ సెషన్‌లో అభిమాని అడిగిన ‘పెళ్లి’ ప్రశ్నకు ఒక హిలేరియస్ ఆన్సర్ ఇచ్చారు సమంత . ఈ సమాధానాన్ని బట్టి ఇక ఆమె పెళ్లిచేసుకోరేమో అనే అనుమానం అందరిలో కలుగుతోంది.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత మీకు ‘మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన మీకు ఉందా?’ అని ఒక అభిమాని ప్రశ్నించగా.. సమంత చాలా వివరంగా సమాధానం ఇచ్చారు. 2023 విడాకుల లెక్కల నివేదిక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసి.. ‘తాజా లెక్కల ప్రకారం చెడ్డ పెట్టుబడి అవుతుంది’ అని బిజినెస్‌లో పెట్టుబడి మాదిరిగా సమాధానం ఇచ్చారు. దీనికి ఒక స్మైల్ ఎమోజీని కూడా జత చేశారు. అంటే 2023 వరకు చూసుకుంటే మొదటిసారి పెళ్లిచేసుకున్న వారిలో విడాకులు తీసుకుంటున్న వారి రేటు సుమారు 50 శాతం ఉంటే రెండోసారి పెళ్లి చేసుకున్నవారిలో విడాకులు తీసుకుంటున్నవారి రేటు 67 శాతంగా ఉంది. ఇక మూడోసారి పెళ్లి చేసుకున్నవారిలో విడాకులు తీసుకుంటున్నవారి రేటు 73 శాతంగా ఉంది. మగ, ఆడ ఇద్దరిలో కూడా ఈ రేటింగ్ అలానే ఉందని సమంత లెక్కలతో చెప్పింది. సమంత సమాధానంతో ఆమె ఇక పెళ్లి చేసుకోదేమో అని అందరు అనుకుంటున్నారు