బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచే రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. అన్ని ప్రాంతీయ భాషలలో ఈ షోకి మంచి ఆదరణ లభిస్తుంది. ఇక తెలుగు విషయానికి వస్తే ఇప్పటికే ఏడు సీజన్స్, ఒక ఓటీటీ షో పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్‌లో కూడా కొందరికి మంచి పాపులారిటీ దక్కుతుంది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గోన్న శ్రీ సత్యకి ఎంత స్టార్ డం వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆమె అందానికి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. హౌజ్‌లో ఉన్నప్పుడు ఈ భామ అర్జున్ కళ్యాణ్‌ని తన వెనక తిప్పించుకుంది. చివరికి అతనికి హ్యాండ్ ఇచ్చింది.
ఇక గేమ్ కోసమే అర్జున్ కళ్యాణ్‌ని వాడుకుందని శ్రీసత్యపై కొందరు విమర్శలు గుప్పించారు. అర్జున్ 7వ వారం ఎలిమినేట్ కాగా, ఆ సమయంలో శ్రీసత్య కోసం చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. అసలు షోకి నీకోసమే వచ్చానంటూ చెప్పి షాకిచ్చాడు.ఇక అర్జున్ వెళ్లిపోయాక శ్రీసత్య.. శ్రీహాన్‌కి బాగా కనెక్ట్ అయింది. ఇద్దరు ఫ్రెండ్షిప్ పేరుతో నానా రచ్చ చేశారు. ఫ్యామిలీ వీక్‌లో హౌజ్‌లోకి వచ్చిన సిరి.. శ్రీహాన్‌కి ఇన్‌డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చింది.దాంతో కాస్త తేరుకొని శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో బయటకు వచ్చేసింది.
బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక శ్రీ సత్య పలు టీవీ షోలలో తెగ సందడి చేస్తుంది. బీబీ జోడిలో మెహబూబ్ తో పాటు జతకట్టి డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఈ షో కోసం ఆమె చాల కష్టపడింది. మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజాగా సుమ షోలో పాల్గొన్న శ్రీసత్యకి సుమ నుండి ఓ ప్రశ్నఎదురైంది. నీకు ఎలాంటి మొగుడు కావాలి? అని సుమ అడగ్గా.. నాకు కొరియన్ మొగుడు కావాలని చెప్పింది. ఆమె క్రేజీ కోరిక విన్న ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇక లేడి గెటప్‌లో ఉన్న కమెడీయన్ నాకు అమెరికర్ మొగుడు కావాలని అన్నాడు. దీంతో అక్కడ తెగ నవ్వులు పూశాయి. కాగా, శ్రీసత్య లవ్‌లో ఫెయిలైందని అందుకే అప్పటి నుండి వాటికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది.