Site icon vidhaatha

ఆరోగ్యంపై ఎంతో శ్ర‌ద్ధ‌ వ‌హించే ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫ‌ర్ భార్య స‌డెన్‌గా ఎందుకు చ‌నిపోయింది..!

ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు లేదంటే వారి కుటుంబ స‌భ్యులు అనారోగ్యాల‌తో క‌న్నుమూస్తుండ‌డం ప్ర‌తి ఒక్క‌రిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇక రీసెంట్‌గా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌కుమార్‌ భార్య అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ప్ర‌ముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆమె బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, కొద్ది రోజులుగా కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే గురువారం (ఫిబ్రవరి15వ తేదీన) ఆమె ఆరోగ్యం మ‌రింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు .

సెంథిల్‌ కుమార్‌ 2009లో రుహీని వివాహం చేసుకోగా, అప్ప‌టి నుండి ఇద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉంటూ వ‌స్తున్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు కాగా, సినీ పరిశ్రమతో ఆమెకు సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ప్రముఖ హీరోయిన్‌ అనుష్క శెట్టితో కూడా రూహి క‌లిసి ప‌ని చేసిన‌ట్టు తెలుస్తుంది. మొదట్లో ఆమె ముంబైలో ఉండేవారు. బాలీవుడ్‌లో రాణిముఖర్జి, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, కరీనా కపూర్‌‌కు కూడా రూహి యోగా టీచర్‌గా పనిచేశారు. సెంథిల్‌తో పెళ్లయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడిన త‌ర్వాత టాలీవుడ్ కి చెందిన ప్రభాస్, ఇలియానా, ఛార్మీ, భూమిక, తమన్నా సహా పలువురు నటీనటులకు యోగా క్లాసులు చెప్పిన‌ట్టు తెలుస్తుంది.యోగా శిక్ష‌కురాలు అయిన రూహి మొద‌టి నుండి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించేది. అయితే కొవిడ్-19 బారినపడిన తర్వాత నుంచి ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స‌మాచారం. అయితే ఆమె అవ‌య‌వాలు ఏవి ప‌ని చేయ‌క‌పోవ‌డంతోనే క‌న్నుమూసిన‌ట్టు స‌మాచారం.

ఆరోగ్యంపై ఎంతో జాగ్ర‌త్త వ‌హించే ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫ‌ర్ భార్య స‌డెన్‌గా ఎందుకు చ‌నిపోయింది..!రూహి అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కొనసాగుతాయని కుటుంబసభ్యులు వెల్లడించారు. రూహి భ‌ర్త సెంథిల్ కుమార్‌ను దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్‌గా చెబుతారు.ఆయ‌న ‘సై’ సినిమాతో మొదలుపెట్టి ‘ఛత్రపతి’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలకు రాజమౌళితో కలిసి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేశాడు. రాజమౌళి సినిమాలతో తీరిక లేకుండా పనిచేస్తున్న సెంథిల్‌కి కరోనా స‌మ‌యంలో భార్య, పిల్ల‌ల‌తో క‌లిసి గ‌డిపేందుకు అవ‌కాశం రావ‌డంతో ‘కరోనాకు థ్యాంక్స్’ అని కూడా చెప్పారు. అయితే తాను ఎంత‌గానో ప్రేమించే భార్య ఇలా క‌న్నుమూయ‌డం సెంథిల్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. సెంథిల్‌కి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.

Exit mobile version