Site icon vidhaatha

ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణానికి వాళ్లే.. జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ సంచ‌లన‌ వ్యాఖ్య‌లు

వెండితెర‌పై ఓ వెలుగు వెలిగి అర్ధాంతరంగా త‌నువు చాలించిన న‌టుడు ఉద‌య్ కిర‌ణ్‌. ఆయ‌న మ‌ర‌ణించి ప‌దేళ్లు అవుతున్నా కూడా ఇప్ప‌టికి ఆయ‌న మ‌ర‌ణంకి సంబంధించి ఏదో ఒక వార్త వైర‌ల్ అవుతూనే ఉంటుంది. ఉద‌య్ కిర‌ణ్ గురించి తెలిసిన వాళ్లు ఆయ‌న మ‌ర‌ణానికి సంబంధించి ఏదో ఒక విష‌యం చెబుతూ హాట్ టాపిక్ అవుతుంటారు. ఉద‌య్ కిర‌ణ్ సూసైడ్‌ చేసుకున్న నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకి కారణం ఏంటనేది ఇప్పటికీ స‌స్పెన్స్‌గానే ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన ఉద‌య్ కిర‌ణ్ మృతిపై తాజా ఇంటర్వ్యూలో జ‌బ‌ర్ధ‌స్త్ ఫేమ్ శేకింగ్ శేషు స్పందించారు.

‘గతంలో హీరో ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు రాకనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చావుకు అవకాశాలు ఇవ్వని వాళ్లే కారణం’ అంటూ ఆయ‌న సంచ‌లన కామెంట్స్ చేశారు. ఈ ఇంట‌ర్వ్యూ చాలా పాత‌దే అయిన ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. ఉద‌య్ కిర‌ణ్ మృతిపై ఆయ‌న చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ కూడా అవుతున్నాయి. శేషు జబర్దస్త్ కమెడియన్లలోనే అత్యంత సీనియర్‌గా ఆయన ప్రత్యేకతని సొంతం చేసుకొని త‌న‌దైన కామెడీతో మెప్పించాడు. తాగుబోతు క్యారెక్టర్ తో పాపులర్ అయిన అత‌ను మిమిక్రీతో పలు పాత్రలకు ప్రాణం పోశారు అని చెప్పాలి.

ఒక దశలో అవకాశాలు రాక చచ్చిపోవాలని అనిపించింది అని శేషు అని అన్నాడు. నటించడం కోసమే ఇండస్ట్రీకి వచ్చిన వాడికి మంచి డైరెక్టర్ సినిమాలో అవకాశం రాకపోతే ఏం చేయాలి.? సంసారాన్ని పోషించలేని వాడు ఆత్మహత్య చేసుకోవాల్సి వ‌స్తుంది. గొప్ప దర్శకుల సినిమాల్లో అవకాశాలు రాకపోతే చాలా బాధగా ఉంటుంది అంటూ శేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ లో మంచి ఫామ్‌లో ఉన్నసమయంలోనే అనిల్‌ రావిపూడి పిలిచి సుప్రీం చిత్రంలో మంచి ఆఫ‌ర్ త‌న‌కి రావ‌డంతో ఇక అప్ప‌టి నుండి జ‌బ‌ర్ధ‌స్త్‌ని వ‌దిలి సినిమాలు చేస్తున్నాన‌ని శేష్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version