Site icon vidhaatha

పాక్ టీంలో బాబ‌ర్‌, ఆఫ్రిది మ‌ధ్య విభేదాలు.. అందుకే అట్ట‌ర్‌ఫ్లాప్ అయిందా..!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో సెమీస్‌కి వెళ్లే నాలుగు టీంలు ఏంటో అధికారికంగా ఓ క్లారిటీ వ‌చ్చాయి. కోల్‌కత్తాలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 93 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడ‌డంతో న్యూజిలాండ్ సెమీస్ స్థానం ద‌క్కించుకుంది. ఇక ఆఖరి రెండు మ్యాచుల్లో వరుస విజయాలు అందుకున్న ఇంగ్లాండ్, పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచి, నేరుగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అర్హత సాధించింది. ఇంగ్లండ్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 337 పరుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ మలాన్ 31 పరుగులు, జానీ బెయిర్‌స్టో 59 పరుగులు, జో రూట్ 60, బెన్ స్టోక్స్ 84, జోస్ బట్లర్ 27, హారీ బ్రూక్ 30, మొయిన్ ఆలీ 8, డేవిడ్ విల్లే 15 పరుగులు చేయ‌డంతో పాక్ ముందు భారీ టార్గెట్ విధించారు.

అయితే పాక్ బ్యాట్స్‌మెన్స్‌లో ఎవ‌రు కూడా నిల‌క‌డ‌గా బ్యాటింగ్ చేయ‌క‌పోవ‌డం వ‌ల‌న 93 ప‌రుగుల తేడాతో ఓడిపోవ‌ల‌సి వ‌చ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్, స్టార్ పేసర్ షాహిది అఫ్రిది మధ్య విభేదాలు స్ప‌ష్టంగా క‌నిపించాయి. వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు నుండే ఈ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. జ‌ట్టు కూడా రెండు వ‌ర్గాలుగా విడిపోయిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. రీసెంట్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింద‌ని, తీవ్రంగా గొడ‌వ‌ప‌డ్డ‌ట్టు కొన్ని ప‌త్రిక‌లు కూడా రాసుకొచ్చాయి. అయితే ఇంగ్లండ్‌తో జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు కెమెరాకు స్ప‌ష్టంగా చిక్కాయి.

షాహిన్ ఆఫ్రిది వికెట్ తీసిన స‌మ‌యంలో బాబ‌ర్ ఆజ‌మ్ అత‌న్ని విష్ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోగా, కీపర్ మహమ్మద్ రిజ్వాన్ షాహిన్ అఫ్రిదికి హైఫై స‌మ‌యంలో బాబర్ ఆజామ్ ఉద్దేశపూర్వకంగా చేతుల‌ని ప‌క్క‌కు నెట్టేశాడు. ఇది చూసి షాహిది అఫ్రిది తీవ్ర‌ ఆగ్రహానికి గురయ్యాడు. ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పాకిస్తాన్ జ‌ట్టులో ఉన్న విభేదాల వ‌ల్ల‌నే ఇంత చెత్త‌గా మ్యాచ్‌లు ఆడింద‌ని ప‌లువురు తెలియ‌జేస్తున్నారు. ఇక ప్రపంచకప్ వైఫల్యంతో బాబర్ ఆజామ్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించి షాహిన్ ఆఫ్రిదికి కెప్టెన్సీ ప‌గ్గాలు అందించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. 

Exit mobile version