Site icon vidhaatha

అరే ఏంట్రా ఇది.. నిత్యం నీ చుట్టూ వివాదాలేనా.. ష‌ణ్ముఖ్ కేసులో సంచ‌ల‌న నిజాలు వెలుగులోకి…!

బిగ్ బాస్ సీజ‌న్‌5లో రన్న‌ర‌ప్‌గా నిలిచిన ష‌ణ్ముఖ్ జస్వంత్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. యూట్యూబ‌ర్‌గా కూడా మనోడు చాలా ఫేమ‌స్. అయితే ష‌ణ్ముఖ్ వివాదాల‌తోనే ఎప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తుండ‌డం గ‌మ‌న‌ర్హం. గ‌తంలో తప్పతాగి రాష్ డ్రైవింగ్ చేసి వాహనాలను ఢీ కొట్టిన కేసులో అరెస్ట్ అయిన షణ్ముఖ్.. ఆ త‌ర్వాత బిగ్ బాస్ 5లో సిరి హ‌నుమంతుతో చేసిన ఘ‌న‌కార్యంతో కూడా వార్త‌ల‌లో నిలిచాడు. హౌజ్‌లోకి వెళ్ల‌క ముందు దీప్తి సున‌య‌న‌తో ప్రేమ‌లో ఉన్న మ‌నోడు హౌజ్‌లోకి వెళ్లాక సిరితో స‌ర‌సాలు ఆడడం వంటివి చేశాడు. దీంతో దీప్తి సున‌య‌న కూడా బ్రేక‌ప్ చెప్పింది. ఆ త‌ర్వాత బ్రేక‌ప్ బాధ‌లో ఉన్న ష‌ణ్ముఖ్‌కి అత‌నిత అన్న సంప‌త్ విన‌య్ స‌పోర్ట్‌గా నిలిచాడు.

ఈ వయసులో ప్రేమ, బ్రేకప్‌లు వ‌ద్దు.. నాలాంటి వాడికి ఫ్రెండ్స్, అమ్మనాన్నల ప్రేమే దక్కుతుంది తమ్ముడూ.. కానీ నీలాంటి వాడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ ఉంది.. ముందు ముందు దేశం మొత్తం నిన్ను ప్రేమిస్తుంది.. కాబట్టి ప్రేమలో ఓడిపోయానని దిగులు చెందకు సోదరా’ అంటూ తెగ ధైర్యం అందించాడు. అయితే ఇప్పుడు అన్న‌ద‌మ్ములు ఇద్దరు గంజాయి కేసులో అరెస్ట్ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ష‌ణ్ముఖ్ సోద‌రుడు సంప‌త్ కొన్నాళ్లుగా మోనిక అనే అమ్మాయితో చాలా ఏళ్లుగా రిలేష‌న్‌లో ఉన్నాడు. 2015 జూన్ నుంచి వీళ్లిద్దరూ రిలేష‌న్ షిప్ కొన‌సాగిస్తుండ‌గా, ఆమెని శారీర‌కంగా కూడా వాడుకున్నాడ‌ట‌. అయితే చివ‌రికి ప్రేయసిని కాదని మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడు సంప‌త్.

ఈ విష‌యం తెలుసుకున్న మోనిక పోలీస్ కంప్లైంట్ ఇవ్వ‌గా యువతి ఫిర్యాదు మేరకు సంపత్ కోసం నానక్‌రాంగూడలోని సంపత్ ఫ్లాట్ కి వెళ్ళారు పోలీసులు. అక్కడ సంపత్ తమ్ముడు షణ్ముక్ కూడా ఉండటంతో.. ఫ్లాట్ లో సంపత్ కోసం గాలిస్తుండ‌గా, మ‌త్తు ప‌దార్ధాలు దొరికాయి. దాంతో వాటిని స్వాధీనం చేసుకొని ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు. మొత్తానికి వాగులో తప్పించుకున్న వాడు వరదలో పడ్డట్టు అయ్యింది షణ్ముఖ్ పరిస్థితి. షణ్ముఖ్ అన్నయ్య.. సంపత్ వినయ్ ఓ కంపెనీకి కో ఫౌండర్‌గా ఉండ‌గా, మ‌నోడిలో కూడా మంచి టాలెంట్ ఉంద‌ట‌. మోడ‌లింగ్‌లో ట‌చ్ ఉంది. షార్ట్ ఫిలింలు కూడా చేస్తుంటాడు. అలానే ట్రిప్స్ ఎక్కువ‌గా వేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.  

Exit mobile version