Site icon vidhaatha

గౌత‌మ్‌కి గూబ గుయ్య‌మ‌నిపించేలా శివాజి ఫైర్..ఒక్క‌సారి అంత సీరియ‌స్ అయ్యారేంటి..!

గ‌త రెండు మూడు రోజులుగా కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ హౌజ్‌లోకి రావడంతో బిగ్ బాస్ హౌజ్ మొత్తం చాలా ఎమోష‌న‌ల్‌గా మారింది.తాజా ఎపిసోడ్‌లో రతిక తండ్రి బిగ్ బాస్ హౌజ్‌లోకి రాగా, ఆయ‌న అంద‌రిని మంచి గేమ్ ఆడి బ‌య‌ట‌కు రావాల‌ని, వచ్చాక త‌న ఇలాకాలో దావ‌త్ ఇస్తాన‌ని చెబుతాడు. ఇక త‌న బిడ్డ‌తో క‌లిసి డీజే టిల్లు పాట‌కి స్టెప్పులేస్తాడు రాములు. మ‌రో ప‌క్క ప్ర‌శాంత్ త‌న ఫ్యామిలీ నుండి ఇంకా ఎవ‌రు రావ‌డం లేద‌నే దిగులుతో ఉంటాడు ప్ర‌శాంత్. పొద్దటి నుంచి ఏమీ తినకుండా.. బిగ్ బాస్ మెయిన్ గేట్ వంకే చూస్తుంటాడు. కెప్టెన్ శోభ, ప్రియాంక ఎంత చెప్పినా.. ‘నాన్నో.. అమ్మో.. వస్తారు… వాళ్లతో కలిసి తింటా.. అన్నం కొంచెమే ఉంది అక్కా..’ అంటూ.. చెప్పి.. అలా కూర్చుండిపోతాడు.

అయితే అదే స‌మ‌యంలో ముద్ద బంతి పూలతో… పల్లవి ప్రశాంత్ తండ్రి బిగ్ బాస్ హౌజ్‌లోకి వ‌చ్చేస్తాడు. బంగారం అని పిలుస్తూ ప్ర‌శాంత్ తండ్రి రావ‌డంతో ప‌రుగెత్తుకెళ్లి అత‌ని కాళ్ల‌మీద ప‌డ‌తాడు. ఒక‌రినొక‌రు చూసుకొని చాలా సంబ‌ర‌ప‌డ‌తారు. అయితే ప్ర‌శాంత్ తండ్రి త‌న కొడుకుకి కొన్ని స‌ల‌హాలు ఇస్తాడు. గొడ‌వ‌లు పెట్టుకోకుండా మంచిగా ఆడ‌మ‌ని చెబుతాడు. అందుకు ప్రశాంత్ కూడా స‌రేన‌ని చెబుతాడు. ప్ర‌శాంత్ తండ్రితో ఫ్యామిలీ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక వ‌చ్చేవారం కెప్టెన్ ఎవ‌రు అనే దానిపై డిస్క‌ష‌న్ మొద‌ల‌వుతుంది. వచ్చే వారం కెప్టెన్సీ కంటెడెర్స్‌గా పోటీ పడేందుకు ‘హో బేబీ’ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా… హౌస్‌లో ఉన్న ప్రతీ ఒక్కరి ముఖాల ఫోటోలు ఉన్న బేబీ ఫోటోలు ఉంటాయని.. బజర్గా బేబీ ఏడుపు వినబడగానే హౌస్‌లోని అందరూ పరుగెత్తుకెళ్లి.. బేబీని పట్టుకుని.. గార్డెన్లో ఓ మూలన ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ లోపలికి వెళ్లాలని చెబుతాడు

చివరగా ఎవరైతే లోపలికి వెళతారో.. బేబిపై ఎవ‌రి ఫేస్ ఉంటుందో వారు కెప్టెన్సీ కంటెడర్స్ టాస్క్‌ నుంచి ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ తెలియ‌జేస్తాడు. ఇక ఈసారి కూడా ఎప్ప‌టి మాదిరిగానే అమ‌ర్ బ‌లైపోతాడు. అమ‌ర్‌ని ర‌తిక వేడుకోవ‌డంతో మ‌నోడు సాక్రిఫైస్ చేసి గేమ్ నుండి త‌ప్పుకుంటాడు. కాని ఆ సాక్రిఫైస్ వేస్ట్ అవుతుంది. ర‌తిక కూడా వెంట‌నే ఔట్ అవుతుంది. చివ‌రిగా గేమ్‌లో శివాజీ , అర్జున్ ఇద్దరూ మిగులుతారు. అయితే ఈక్రమంలోనే డాక్టర్ బాబు గౌతమ్‌ మళ్లీ తనకు అన్యాయం జరిగిందంటూ.. అందుకు శివాజీనే కారణం అంటూ ర‌చ్చ చేస్తాడు. మేం మీ మాట‌లు వినాలా, బిగ్ బాస్ మాట‌లు వినాలా అంటూ గౌత‌మ్.. శివాజీపై ఫుల్ ఫైర్ అవుతాడు. దీంతో శివాజి త‌న‌లోని ఫైర్ యాంగిల్ బ‌య‌ట‌కి తెస్తాడు. ఓ దశలో ఇద్దరూ… పోటా పోటీగా ముందుకొచ్చి.. ఒకరి మీదికి ఒకరు దూసుకెళుతూ కొట్టుకున్నంత పని చేశారు. ఆవేశంలో గౌత‌మ్ మైక్ తీసి ప‌డేసి డోర్ ఓపెన్ చేయండి అంటూ మెయిన్ డోర్‌ని బాదుతాడు. అయితే శోభ అత‌డిని కొంత కూల్ చేస్తుంది. ఇక ప్రిన్స్ , అమర్ మధ్య కూడా వివాదం చెల‌రేగ‌గా అది కూడా ఓ రేంజ్‌లో న‌డిచింది. 

Exit mobile version