బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టాగా సాగింది. ఈ సీజన్‌కి మరో వారం రోజులలో ఎండ్ కార్డ్ పడనుంది. అయితే ఈ సీజన్‌లో ఆరుగురు ఫైనలిస్ట్‌లుగా ఉండగా, చివరిగా శోభా శెట్టిని ఎలిమినేట్ చేశారు. ఆమె తన ఎలిమినేషన్‌ని ముందుగానే ఊహించిందో ఏమో కాని పెద్దగా బాధపడినట్టు కనిపించలేదు. అయితే ఏవీ చూసిన తర్వాత మాత్రం చాలా ఏడ్చేసింది. నాగార్జున ఆమెని ఓదార్చారు. అయితే సీరియల్ బ్యాచ్‌కి చెందిన శోభా శెట్టిపై చాలా నెగెటివిటీ ఉంది. ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందని అందరు అనుకున్నారు. కాని ఆమెని చాలానే కాపాడుకుంటూ వచ్చారు.
శోభా శెట్టి కోసం కొన్నిసార్లు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని కూడా ఎలిమినేట్ చేశారనే టాక్ వినిపించింది. షో చివరి దశకు చేరుకోవడంతో ఆమెని తప్పక బయటకి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సీరియల్‌లో మోనితగా నెగెటివ్ క్యారెక్టర్ పోషించిన శోభా శెట్టి హౌజ్‌లో కూడా అలానే ప్రవర్తించింది. శోభా శెట్టి ప్రవర్తన, ఆట తీరు, మాట తీరు చాలా మంది ఆడియన్స్‌కి చిరాకు తెప్పించాయి. సీరియల్ బ్యాచ్‌గా గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఇతర హౌజ్‌మేట్స్‌పై దాడి చేసేవారు. ఇక వారిలో వారు తెగ సపోర్ట్ చేసుకుంటూ గేమ్ ఆడారు. అయతే ఎందుకో ఏమో ఎప్పుడు నామినేషన్స్‌లో ఉన్నా తక్కువ ఓట్స్ పడేవి. కాని ఆమెని మాత్రం ఎలిమినేట్ చేసేవారు కాదు.
14వ వారం మాత్రం శోభా శెట్టికి గుడ్ బై చెప్పారు. ఎలిమినేట్ అయినప్పటికీ శోభ శెట్టి భారీ రెమ్యునరేషన్ దక్కించుకున్నట్టు సమాచారం. సీరియల్ నటి అయిన శోభ శెట్టి వారానికి రూ. 2.25 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టిందని, 14 వారాలకు రూ. 31.5 లక్షలు ఆమెకి ముట్టినట్టు సమాచారం. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్లలో ఎవరూ ఇంత మొత్తం తీసుకోకపోవడంతో శోభ శెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది అని చెప్పాలి. ఇక ఫైనలిస్ట్‌ల విషయానికి వస్తే ఈ సారి ఆరుగురు ఉన్నారు. అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. శివాజీ, ప్రశాంత్, అమర్ ప్రియాంక, యావర్‌లని రీసెంట్‌గా నాగార్జున ఫైనలిస్ట్‌లుగా ప్రకటించారు. వీరు ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.