Site icon vidhaatha

వ‌న‌ప‌ర్తి జిల్లాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి..!

ఇటీవ‌ల చాలా మంది సెల‌బ్రిటీలు పెళ్లి పీట‌లు ఎక్కుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కొంద‌రు గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటుండ‌గా, మ‌రి కొంద‌రు సైలెంట్‌గా వివాహం చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం తాప్సీ కూడా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంద‌ని ప్రచారం జ‌రిగింది. దీనిపైన ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ఇక ఇప్పుడు సిద్ధార్థ్, అదితి కూడా సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నార‌ని జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. సిద్ధార్థ్ ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో డ్రీమ్ బాయ్‌గా, అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా అల‌రించాడు. ఆయ‌న బాయ్స్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. ఇక ఆ త‌ర్వాత అనేక భాష‌ల‌లో సినిమాలు చేశాడు. తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.

అయితే ఇటీవ‌ల ఆయ‌నకి మంచి హిట్స్ రాక‌పోవ‌డంతో సైలెంట్ అయ్యాడు. అడ‌పాద‌డ‌పా చిన్న చిత‌కా చిత్రాల‌తో అల‌రించే ప్ర‌య‌త్ని చేస్తున్నాడు. అయితే సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి గత కొంతకాలంగా డేటింగ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ‘మహాసముద్రం’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ.. ఆ సమయం నుండి ప్రేమ‌లో మునిగి తేలుతున్నార‌ని అనేక వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై వారు స్పందించింది లేదు. కాని డిన్నర్స్, లంచ్, పార్టీలకు వెళ్తూ తెగ సంద‌డి చేస్తున్నారు. వీరు త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటార‌ని ప్ర‌చారం న‌డుస్తున్న స‌మ‌యంలో వారు సైలెంట్‌గా పెళ్లి పీట‌లెక్కార‌ని ఓ టాక్ న‌డుస్తుంది.

వనపర్తిలోని శ్రీరంగపురం ఆలయంలో వీరి వివాహం చాలా సైలెంట్‌గా జ‌రిగింద‌ని స‌మాచారం. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. తమిళనాడుకు చెందిన పురోహితులు వీరి పెళ్లి తంతును సంప్రదాయబద్దంగా జరిపించార‌ని అంటున్నారు. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలోనే సిద్ధార్థ్, అదితి వివాహం జరిగింది. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు కావ‌డంతో పురోహితులు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించిన‌ట్టు టాక్. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇక అదితి ఇటీవ‌లి కాలంలో పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో మాత్రం నానా ర‌చ్చ చేస్తుంది. 

Exit mobile version