Site icon vidhaatha

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి.. సాక్ష్యం ఈ ఫోటోలే..!

కొన్నాళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలుతున్న సిద్ధార్థ్, అదితి ఎట్ట‌కేలకి పెళ్లి బంధంతో ఒక్క‌ట‌య్యారు. తెలంగాణలోని వనపర్తి దగ్గరలో ఉన్న శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో వారు పెళ్లి చేసుకోవ‌డం విశేషం. వీరి పెళ్లికి రెండు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హాజరయ్యారు. వనపర్తి సంస్థానధీశుడు.. రంగనాథస్వామి ఆలయ ధర్మకర్త కృష్ణదేవరావు ముఖ్య అతిథిగా ఈ పెళ్లి వేడుక జ‌రిగింది. ఆంక్ష‌ల నడుము పెళ్లి వేడుక జ‌ర‌గ‌డంతో ఎవ‌రిని కూడా అనుమ‌తించ‌లేదు. త‌మిళ‌నాడుకి చెందిన పురోహితులు వీరి వివాహం జ‌రిపించిన‌ట్టు తెలుస్తుంది.ఈ రోజు ఉదయం 10 గంటలకు తంతు ముగించుకొని వెంటనే అక్క‌డ నుండి నూత‌న దంప‌తులు చెన్నైకి వెళ్లిన‌ట్టు తెలుస్తుంది.

 అయితే పెళ్లి తంతు ముగిసిన త‌ర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన ఫొటోలు కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీనిని బ‌ట్టి సిద్ధార్థ్‌, అదితిల పెళ్లికి సంబంధించిన ప్ర‌చారాలు నిజ‌మేన‌ని అంటున్నారు. కొన్నాళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్క‌టి కావ‌డంతో వారికి ప‌లువురు ప్ర‌ముఖులు, నెటిజ‌న్స్ , అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పెండ్లి కుమార్తె అదితి .. కృష్ణదేవరావు అక్క మనుమరాలు కావడంతో ఇక్కడ పెండ్లి చేసినట్లు సమాచారం. అయితే వీరి పెళ్లికి సంబంధించి ఒక్క ఫొటో కూడా బ‌య‌ట‌కు రాలేదు. ఆన్‌లైన్లోనూ ఫొటోలు లీకవకుండా చాలా జాగ్ర‌త్త‌ప‌డ్డారు.ఇక 2021లో వచ్చిన మహా సముద్రం మూవీలో సిద్ధార్థ్, అదితి కలిసి న‌టించారు. ఆ స‌మ‌యంలో వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఏర్ప‌డింది.


ఇక అప్ప‌టి నుండి ఈ జంట చెట్టాప‌ట్టాలు వేసుకుంటూ తిరుగుతూ కనిపించారు. పెళ్లి గురించి ప్ర‌చారాలు జ‌రిగిన వాటిపై ఏ నాడు స్పందించింది లేదు. అయితే చివరికి అధికారికంగా తమ బంధం గురించి బయటపెట్టకుండా నేరుగా పెళ్లితో ఒక్కటైపోయారు.అయితే అదితి వ‌న‌ప‌ర్తిలో చేసుకోవ‌డం వెన‌క బ‌ల‌మైన కార‌ణం ఉంది. ఆమె తల్లి విద్యా రావు తండ్రి వనపర్తి చివరి రాజు రామేశ్వర రావు కాగా, అదితి తండ్రి పేరు ఎహసాన్ హైదరీ. ఆయన హైదరాబాద్ రాష్ట్రానికి ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీ మనవడు. ఇలా అదితి రావ్ మూలాలు మొత్తం తెలంగాణలో ఉండ‌డంతోనే ఆమె ఇక్క‌డ వివాహం చేసుకుంద‌ని అంటున్నారు.



Exit mobile version